బిజినెస్

ఆరంభ లాభాలు ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 1: తీవ్రమయిన ఊగిసలాట మధ్య సాగిన లావాదేవీలలో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్పంగా నష్టపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఇంట్రా-డేలో ఆరంభంలో ఆర్జించిన లాభాలన్నింటినీ తరువాత కోల్పోయింది. చివరకు పది పాయింట్ల దిగువన ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా స్వల్పంగా ఆరు పాయింట్లు కోల్పోయింది. కీలక సూచీలు లాభాలు, నష్టాల మధ్య ఊగిసలాడాయి. ఓసారి కొనుగోళ్లు పుంజుకోవడం, మరోసారి అమ్మకాలు హోరెత్తడం.. ఇలా ఒకటి తరువాత ఒకటి చోటు చేసుకోవడం వల్ల సెనె్సక్స్ 376 పాయింట్ల హెచ్చుతగ్గుల మధ్య కదలాడింది. గురువారం ఉదయం అధిక స్థాయి 34,650.63 పాయింట్ల వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ తరువాత మరింత ముందుకు సాగుతూ, 34,679.93 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) తగిన స్థాయిలో కొనుగోళ్లు జరపడంతో పాటు మార్కెట్‌కు ఉత్సాహాన్నిచ్చే ప్రపంచ సంకేతాలు వెలువడటం కూడా ఈ సూచీ పుంజుకోవడానికి దోహదపడింది. అయితే, తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల ఈ సూచీ ప్రతికూల జోన్‌లోకి దిగజారి, 34,303.38 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 10.08 పాయింట్ల (0.03 శాతం) దిగువన 34,431.97 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ బుధవారం 550.92 పాయింట్లు పుంజుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 10,441.90- 10,341.90 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 6.15 పాయింట్ల (0.06 శాతం) దిగువన 10,380.45 పాయింట్ల వద్ద ముగిసింది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మధ్య తలెత్తిన విభేదాలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్ గురువారం పటిష్టమయిన స్థాయి వద్ద ప్రారంభమయింది. అయితే, పుంజుకున్న ప్రతిసారీ మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల ఆరంభ లాభాలను నిలబెట్టుకోలేక పోయింది. చమురు ధరలు తగ్గి, రూపాయి బలపడినప్పటికీ, మదుపరులు రెండో త్రైమాసిక ఫలితాలపై దృష్టి సారించినందువల్ల మార్కెట్ సూచీలు హెచ్చుతగ్గుల మధ్య కదలాడాయని విశే్లషకులు పేర్కొన్నారు. రూపాయి కోలుకున్న తరుణంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజి, ఫార్మాస్యూటికల్ రంగాల షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సాఫ్ట్‌వేర్ సేవలను ఎగుమతి చేసే కంపెనీల షేర్ల విలువ కూడా పడిపోయింది.
సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో ఇన్ఫోసిస్ షేర్ విలువ అత్యధికంగా 2.90 శాతం పడిపోయింది. విప్రో షేర్ ధర 0.47 శాతం పడిపోయింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో టీసీఎస్, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, సన్ ఫార్మా, ఆసియన్ పెయింట్స్, ఐటీసీ లిమిటెడ్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, రిల్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉన్నాయి. సెనె్సక్స్ ప్యాక్‌లోని ప్రైవేటు రంగ బ్యాంకు యెస్ బ్యాంక్ అత్యధికంగా 8.35 శాతం లాభపడింది. ఈ బ్యాంకు అక్టోబర్ 11 తరువాత ఒకే సెషన్‌లో ఇంత భారీగా లాభపడటం ఇదే మొదటిసారి. లాభపడిన ఇతర సంస్థల్లో ఎల్‌అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్, వేదాంత లిమిటెడ్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, అదాని పోర్ట్స్ ఉన్నాయి. వాహన రంగ షేర్లు కూడా గురువారం రాణించాయి.