బిజినెస్

ఫార్చూన్ 500 జాబితాలో ఏడు భారతీయ సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూలై 21: ప్రపంచంలోని అతిపెద్ద సంస్థలకు సంబంధించి ఈ ఏడాదికిగాను తాజాగా విడుదలైన ఫార్చూన్ 500 జాబితాలో ఏడు భారతీయ సంస్థలకు చోటు దక్కింది. రెవిన్యూ ఆధారంగా రూపొందిన ఈ జాబితాలో ఉన్న భారతీయ సంస్థల్లో నాలుగు ప్రభుత్వరంగ సంస్థలైతే, మూడు ప్రైవేట్‌రంగ సంస్థలు.
వీటిలో ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఉన్నాయి. అలాగే ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దేశీయ ఆటోరంగ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటార్స్‌తోపాటు రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ఉన్నాయి. ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసిని వెనక్కినెట్టి రత్నాలు, ఆభరణాల దిగ్గజం రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ఈసారి ఫార్చూన్ 500 జాబితాలో స్థానం సంపాదించడం విశేషం.
ఇదిలావుంటే తాజా జాబితాలో ఉన్న భారతీయ సంస్థల్లో ఇండియన్ ఆయిల్ 54.7 బిలియన్ డాలర్ల రెవిన్యూతో ముందుంటే, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఎస్‌బిఐ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ ఉన్నాయి. నిరుడుతో పోల్చితే ఈ ఏడాది ఇండియన్ ఆయిల్, రిలయన్స్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ర్యాంకులు పడిపోగా, టాటా మోటార్స్, ఎస్‌బిఐ మాత్రం తమ ర్యాంకులను మెరుగు పరుచుకున్నాయి. ఇక అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఈ ఏడాది ఫార్చూన్ 500 జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. టాప్-10 సంస్థల్లో ఆటోమొబైల్ దిగ్గజాలు ఫోక్స్‌వాగన్, టొయోటాతోపాటు టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థలున్నాయ.
కాగా, టాప్-10 సంస్థల్లో మూడు అమెరికావైతే, మూడు చైనావి, మరో మూడు జర్మనీ, జపాన్, బ్రిటన్‌వి. మరొకటి నెదర్లాండ్స్, బ్రిటన్ సంయుక్త సంస్థ ఉన్నాయ. అయతే మెజారిటీ సంస్థలు చమురు రంగానికి చెందినవే ఉన్నాయ. కాగా, 2015లో ఫార్చూన్ 500 సంస్థల ఆదాయం 27.6 ట్రిలియన్ డాలర్లుగా ఉంటే, లాభం 1.5 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది ఫార్చూన్ 500 సంస్థల ఉద్యోగుల సంఖ్య 67 మిలియన్లుగా ఉంది. ఈ సంస్థలు 33 దేశాల్లో తమ కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నాయని ఫార్చూన్ తెలిపింది.