బిజినెస్

పెరుగుతున్న ఫార్మా ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: ఫార్మా ఎగుమతులు ఏటా పెరగడంతో, ఈ రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశాలు మరింతగా మెరుగుపడ్డాయి. 2005-06 ఆర్థిక సంవత్సరంలో 444.17 మిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులు మన దేశం నుంచి ఎగుమతయ్యాయి. 2006-07 ఆర్థిఖ సంవత్సరంలో ఇది 3,184.02 మిలియన్ డాలర్లకు పెరిగింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా వృద్ధి చెందుతున్నది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 12,930.48 మిలియన్ డాలర్ల ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తే, గత ఆర్థిక సంవత్సరంలో ఇది 13,255.62 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఏప్రిల్‌లో మొదలైన తాజా ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుంటే, ఆగస్టు చివరి వరకూ, అంటే, ఐదు నెలల కాలంలోనే సుమారు ఆరువేల మిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను భారత్ ఎగుమతి చేసింది. 5,918.50 మిలియన్ డాలర్లుగా నమోదైన ఈ ఎగుమతులు, ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి గత ఆర్థిక సంవత్సరానికంటే మించిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫార్మా రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వడం, ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెరగడం వంటి అంశాలు ఎగుమతులు పెరగడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవాలి.