బిజినెస్

సీఎన్‌జీ వాహనాల వినియోగంలో ఏపీ కంటే తెలంగాణ బెటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 5: సంపీడన సహజ వాయువు (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్/ సీఎన్‌జీ) వాహనాల వాడకంలో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ మెరుగ్గా ఉంది. కేంద్ర ప్రకటించిన తాజా నివేదిక ప్రకారం, అక్టోబర్ ఒకటో తేదీ నాటికి సీఎన్‌జీ వాహనాలు ఢిల్లీలో అత్యధికంగా ఉన్నాయి. అక్కడ 450 సీఎన్‌జీ స్టేషన్లు ఉండగా, 10,48,903 వాహనాలు తిరుగుతున్నాయి. ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో, సీఎన్‌జీ వాహనాలనే వాడాలన్న చట్టాన్ని అక్కడి సర్కారు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం మూడు సంవత్సరాల నుంచి అమల్లో ఉన్నప్పటికీ, పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాల సంఖ్య ఆశించిన స్థాయిలో తగ్గకపోవడంపై సుప్రీం కోర్టు ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. అయితే, దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే సీఎన్‌జీ వాహనాలు ఢిల్లీలోనే ఎక్కువగా ఉన్నాయి. రెండో స్థానాన్ని గుజరాత్ దక్కించుకుంది. అక్కడ 469 సీఎన్‌జీ స్టేషన్లు, 8,67,528 వాహనాలు ఉన్నాయి. మూడో స్థానంలో మహారాష్ట్ర నిలిచింది. అక్కడ 276 సీఎన్‌జీ స్టేషన్లు ఉంటే, 8,58,447 వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. హర్యానా (54 సీఎన్‌జీ స్టేషన్లు/ 1,47,601 వాహనాలు), ఉత్తరప్రదేశ్ (92 సీఎన్‌జీ స్టేషన్లు/ 1,45,822 వాహనాలు), మధ్యప్రదేశ్ (32 సీఎన్‌జీ స్టేషన్లు/ 35,236 వాహనాలు) వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. కాగా, తెలంగాణ 33 సీఎన్‌జీ స్టేషన్లు, 24,555 వాహనాలతో తెలంగాణ ఏడో స్థానంలో ఉంది. ఎనిమిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 26 సీఎన్‌జీ స్టేషన్లు, 19,417 వాహనాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో అత్యల్పంగా ఒక స్టేషన్, 50 వాహనాలున్నాయి.