బిజినెస్

ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌లో లొసుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, నవంబర్ 5: కష్టాల్లో కూరుకుపోయిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్) సంస్థకు బాధ్యతలు చేపట్టిన కొత్త బోర్డు సంస్థ కష్టాలకు దారితీసిన పలు లొసుగులను కనుగొంది. కంపెనీకి చెందిన వందశాతం సబ్సిడీలను అందించే సంస్థ ఐల్ అండ్ ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎప్‌ఐఎన్) నుంచి ఇతర గ్రూపు సంస్థలకు ఆర్‌బీఐ అనుమతులకు మించి గత మూడేళ్లుగా రుణాల మంజూర్లు, పెట్టుబడులు జరిగాయని ప్రధానంగా కొత్తబోర్డు గుర్తించింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు చెందిన ముంబై ధర్మాసనానికి ఈమేరకు కొత్త బోర్డు నివేదిక అందజేసింది. రిజర్వు బ్యాంకుకు, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వైరుధ్యాల నేపథ్యంలో ఐఎప్‌ఐఎన్‌కు చెందిన అంశం వెలుగులోకి వచ్చింది. ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ కష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో ఏర్పడిన ద్రవ్యలోటును అధిగమించేందుకు ప్రత్యేక ద్రవ్య గవాక్షాన్ని ఎన్‌బీఎఫ్‌ల కోసం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రభుత్వం చేసిన సూచనను రిజర్వుబ్యాంకు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే తీవ్ర ద్రవ్యలోటు ఏర్పడిందన్న విషయాన్ని రిజర్వు బ్యాంకు గవర్నర్ అర్జిత్ పటేల్ తోసిపుచ్చారు. అదనంగా 40వేల కోట్ల రూపాయల ఓఎంఓలను ఆయన రాబోయే దీపావళి పండుగకు ఏర్పడే డబ్బు అవసరాలకు అనుగుణంగా విడుదల చేశారు. కాగా ఐఎఫ్‌ఐఎన్ రికార్డుల ప్రకారం గడచిన నాలుగేళ్ల కాలంలో గ్రూపు కంపెనీలకు తిరిగి చెల్లించని రుణాలు పెట్టుబడుల కింద 5,728 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అలాగే మరో 5,490 కోట్ల రూపాయలను ఎఫ్‌ఐ 16, ఎఫ్‌ఐ 17, 18లకు మంజూరు చేసిందని ఉదయ్ కోటక్ నేతృత్వంలోని బోర్డు ఎసీఎల్టీకి నివేదించింది. ఈ సంస్థకు ఉన్న ప్రస్తుత అప్పులు 94వేల కోట్లు కాగా ఇందులో బ్యాంకులకు మాత్రమే 53వేల కోట్ల అప్పులున్నాయి.