బిజినెస్

నీరవ్ మోదీ ఆస్తుల జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 6: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)ను ముంచి విదేశాలకు పరారయిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి దుబాయిలో ఉన్న రూ. 56కోట్లకు పైగా విలువ కలిగిన 11 ఆస్తులను జప్తు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం తెలిపింది. పీఎన్‌బీ నుంచి నీరవ్ మోదీ మోసపూరితంగా రెండు బిలియన్ డాలర్లకు పైగా రుణం తీసుకొని, ఎగవేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వివరించింది.
దుబాయిలోని జప్తు చేసిన ఆస్తులు నీరవ్ మోదీ, అతని గ్రూప్ కంపెనీ మెస్సర్స్ ఫైర్‌స్టార్ డైమండ్ ఎఫ్‌జెడ్‌ఈ పేరిట ఉన్నాయని, వీటి మొత్తం విలువ 7.79 మిలియన్ డాలర్లు (రూ. 56.8 కోట్లు) అని ఈడీ తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈ ఆస్తుల జప్తుకు ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఈడీ గత నెలలో నీరవ్ మోదీ, అతని కుటుంబ సభ్యులకు చెందిన రూ. 637 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. న్యూయార్క్‌లోని పేరెన్నిక గన్న సెంట్రల్ పార్క్‌లో గల రెండు అపార్ట్‌మెంట్లు కూడా వీటిలో ఉన్నాయి. నీరవ్ మోదీ, ఇతరులకు చెందిన ఆస్తులను చట్టబద్ధంగా జప్తు చేసేందుకు వీలుగా ముంబయి కోర్టు జారీ చేసిన పలు లెటర్స్ రొగేటరీల (ఎల్‌ఆర్‌ల) మేరకు ఈడీ దుబాయిలోని దర్యాప్తు అధికారులతో కలిసి ఈ ఆస్తులను జప్తు చేసింది. పీఎన్‌బీని వంచించి భారీ మొత్తంలో రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వ్యవహారం ఈ సంవత్సరం మొదట్లో వెలుగులోకి వచ్చింది.
అప్పటికే దేశం విడిచి పారిపోయిన నీరవ్ మోదీని అరెస్టు చేయడానికి ఇటీవల ఇంటర్‌పోల్ ఆదేశాలు జారీ చేసింది. నీరవ్ మోదీ చివరిసారిగా బ్రిటన్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అందువల్ల అతడిని బ్రిటన్ నుంచి స్వదేశానికి రప్పించడానికి భారత్ కృషి చేస్తోంది.
చోక్సీ అనుచరుడి అరెస్టు
కోల్‌కతా: నీరవ్ మోదీతో కలిసి పీఎన్‌బీని ముంచిన కేసులో నిందితుడు, అతని మామ మెహుల్ చోక్సీకి చెందిన ఒక కంపెనీ ఎగ్జిక్యూటివ్ దీపక్ కులకర్ణిని ఈడీ అరెస్టు చేసింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దీపక్ కులకర్ణిని కోల్‌కతాలోని నేతాజీ సుభాశ్ చంద్రబోస్ విమానాశ్రయంలో సోమవారం రాత్రి అరెస్టు చేసినట్టు ఈడీ అధికారులు మంగళవారం తెలిపారు. కలకత్తా మూడో కోర్టులోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట మంగళవారం కులకర్ణిని హాజరు పరచగా, కోర్టు అతనిని మూడు రోజుల పాటు ముంబయికి తీసుకెళ్లడానికి ఈడీకి అనుమతి ఇచ్చింది.