బిజినెస్

బలపడిన రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 6: రూపాయి మంగళవారం తిరిగి బలపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు పుంజుకొని, 73 వద్ద ముగిసింది. ఎగుమతిదారులు డాలర్ విక్రయాలకు పూనుకోవడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కొంత తగ్గడం వల్ల రూపాయి విలువ పెరిగింది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగనున్న తరుణంలో మదుపరుల సెంటిమెంట్ అప్రమత్తంగానే ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే డాలర్ బలంగానే ఉంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ (్ఫరెక్స్) మార్కెట్‌లో మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ పటిష్టంగా 72.98 వద్ద ప్రారంభమయింది. సోమవారం డాలర్‌తో మారకం విలువ 73.12 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. మంగళవారం పటిష్ట స్థాయి వద్ద ప్రారంభమయిన రూపాయి విలువ మరింత పుంజుకొని ఇంట్రా-డేలో గరిష్ఠ స్థాయి 72.90ను తాకింది. ఎగుమతిదారులు డాలర్ల విక్రయానికి పూనుకోవడం వల్ల రూపాయి విలువ పుంజుకుంది. అయితే ఆరంభంలో సాధించిన లాభాలను రూపాయి తరువాత నిలబెట్టుకోలేక పోయింది. చివరకు డాలర్‌తో రూపాయి మారకం విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 12 పైసలు ఎగువన 73 వద్ద ముగిసింది. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 67 పైసలు పతనమయి, 73.12 వద్ద ముగిసింది.