బిజినెస్

లాభాలతో ముగిసిన సంవత్ 2074

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్ కీలక సూచీలు స్వల్పంగా పుంజుకున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 41 పాయింట్లు పుంజుకొని 34,991.91 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ ఆరు పాయింట్లు పెరిగి, 10,491.45 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇదిలా ఉండగా, మంగళవారంతో ముగిసిన హిందూ సంవత్సరం సంవత్ 2074లో సెనె్సక్స్ 2,407.56 పాయింట్లు (ఏడు శాతం) పుంజుకోగా, నిఫ్టీ 319.15 పాయింట్లు (మూడు శాతం) పెరిగింది. సెనె్సక్స్ మంగళవారం అధిక స్థాయి 35,076.24 పాయింట్ల వద్ద ప్రారంభమయింది. తరువాత మరింత ముందుకు సాగుతూ 35,196.03 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగియడం వల్ల దాని ప్రతికూల ప్రభావంతో సెషన్ చివరి గంట సమయంలో మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకున్నారు. దీంతో సెనె్సక్స్ అంతకు ముందు ఆర్జించిన లాభాలలో అధిక భాగం కోల్పోయింది. ఒక దశలో ఇంట్రా-డేలో కనిష్ట స్థాయి 34,889.72 పాయింట్లను తాకింది. చివరకు క్రితం సెషన్ ముగింపుతో పోలిస్తే 40.99 పాయింట్ల (0.12 శాతం) ఎగువన 34,991.91 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ సోమవారం 60కిపైగా పాయింట్లు కోల్పోయింది. అదేవిధంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 10,600.25- 10,491.45 పాయింట్ల మధ్య కదలాడింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే స్వల్పంగా ఆరు పాయింట్లు (0.06 శాతం) ఎగువన 10,530 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్లు లాభపడటం, అందుకు అనుగుణంగా ఇతర ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లలో సెంటిమెంట్ బలపడింది. అయితే అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరుగనున్న తరుణంలో మార్కెట్లలో ఉత్కంఠ కూడా నెలకొంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీబాధ్యతలు స్వీకరించి, దిగుమతులపై సుంకాలను విధించడం వంటి వివాదాస్పద వాణిజ్య విధానాలను అమలు చేసిన తరు తరువాత ఆయన ఎదుర్కొంటున్న తొలి ప్రధాన మధ్యంతర ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. దీపావళిని పురస్కరించుకొని మార్కెట్‌కు సెలవులు వస్తుండటంతో సంవత్ 2074 చివరి సెషన్‌లో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా, మంగళవారం నాటి లావాదేవీలలో సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో టీసీఎస్ అత్యధికంగా 2.22 శాతం లాభపడింది. యెస్ బ్యాంక్ 1.95 శాతం లాభంతో రెండో స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థల్లో టాటా మోటార్స్, రిల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, భారతి ఎయిర్‌టెల్, వేదాంత, ఐసీఐసీఐ బ్యాంక్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, ఎల్‌అండ్‌టీ, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం ఉన్నాయి. వీటి షేర్ల విలువ 1.69 శాతం పెరిగింది. మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ 2.98 శాతం నష్టపోయింది. యాక్సిస్ బ్యాంక్ 2.67 శాతం నష్టపోయింది. మారుతి సుజుకి, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదాని పోర్ట్స్, ఐటీసీ, హెచ్‌యూఎల్, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, హీరో మోటోకార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా నష్టపోయాయి. వీటి షేర్ల విలువ 1.31 శాతం వరకు పడిపోయింది.