బిజినెస్

50 నగరాల్లో ఇంటింటికీ గ్యాస్ సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: రిటైల్ సీఎన్‌జీ, పైపుల ద్వారా సహజవాయువు సరఫరాకు సంబంధించి 50 నగరాల్లో వౌలిక సదుపాయాల ఏర్పాటుపై పెట్రోలియం, నేచురల్‌గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) బిడ్డింగ్‌లను ఆహ్వానించింది. ఈ నగరాల్లో గ్వాలియార్, మైసూరు, ఆజ్మీర్, హౌరా నగరాలు ఉన్నయి. ఎంపిక చేసిన సంస్థలకు సిటీ గ్యాస్ లైసెన్సులను మంజూరు చేస్తారు. ఒక్కో నగరం పరిసరాల్లోని జిల్లాలకు కూడా సీఎన్‌జీ, నేచురల్ గ్యాస్‌ను సరఫరా చేస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీలోగా బిడ్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. సీఎన్‌జీ స్టేషన్లు, వంట గ్యాస్ సరఫరాకు అవసరమైన స్టేషన్లను నెలకొల్పేందుకు అవసరమైన ప్రాంతాలు, వాటి సంఖ్యపై సంస్థలు వివరాలను పీఎన్‌జీఆర్‌బీకి తెలియచేయాల్సి ఉంటుంది.
ఈ సంస్థలు పైపు లైన్ల పొడువు, జనాభాకు తగ్గట్టుగా నిర్మించదలచిన స్టేషన్ల సంఖ్య వివరాలను తెలియచేయాలి. 22 రాష్ట్రాల్లో 174 జిల్లాలకు సీఎన్‌జీ, కుకింగ్ గ్యాస్ సరఫరా జరిగే విధంగా పైపులైన్లను నిర్మించాల్సి ఉంటుంది. 2020 నాటికి ఒక కోటి మందికి కుకింగ్ గ్యాస్‌ను పైప్‌లైన్లద్వారా సరఫరా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పదవ రౌండ్‌లో నెల్లూరు, ముజఫర్‌పూర్, కైతాల్, మైసూరు, గుల్బర్గా, అల్లపుజ, కొల్లం, ఉజ్జయిని, గ్వాలియార్, మొరీనా, ఝాన్సీ, బస్తి, ఫిరోజ్‌పూర్, హోషియార్‌పూర్, పంజాబ్, ఆజ్మీర్, జాలర్, నైనీటాల్, డార్జిలింగ్, హౌరా నగరాలను ఎంపిక చేయనున్నారు. 50 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకు సంబంధించి బిడ్స్‌ను దాఖలు చేసే సంస్థకు టర్నోవర్ రూ.150 కోట్ల టర్నోవర్ ఉండాలి. అదే 20-50 లక్షల జనాభా ఉన్న ప్రాంతాలకు బిడ్స్ దాఖలు చేసే సంస్థకు టర్నోవర్ వంద కోట్ల రూపాయలుండాలి. ఎంపిక చేసిన సంస్థ 270 రోజుల్లోపల ఫైనాన్షియల్ క్లోజర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. బిడ్స్‌లో అర్హత సాధించిన సంస్థకు ఎనిమిదేళ్ల పాటు కాంట్రాక్టు అమలులో ఉంటుంది. 9వ రౌండ్‌లో గౌతమ్ అదానీ గ్రూప్, ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్, టారెంట్ గ్యాస్ సంస్థలు అర్హత సాధించాయి.