బిజినెస్

బుల్ రన్ సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 8: గత కొంతకాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ఎక్కువ భాగం నష్టాల్లో నడుస్తున్న స్టాక్ మార్కెట్ రెండు రోజుల సెలవుల తర్వాత ఎంత వరకు కోలుకుంటుందనేది ఆసక్తిని రేపుతున్నది.
దీపావళి లక్ష్మీపూజ, దీపావళి బలిప్రతిపాద కారణంగా బుధ, గురువారాలు స్టాక్ మార్కెట్‌కు సెలవు ప్రకటించారు. దీనితో ఈవారం లావాదేవీలు శుక్రవారం మాత్రమే జరుగుతాయి. తిరిగి, శని, ఆది వారాలు వారంతపు సెలవులు. ఈ నేపథ్యంలో శుక్రవారం బుల్ రన్ సాధ్యమా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే వారం స్టాక్ మార్కెట్ తీరుతెన్నులు ఏ విధంగా ఉంటాయన్నది శుక్రవారం నాటి మార్కెట్ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుందనేది వాస్తవం. సెనె్సక్స్ భారీగా లాభపడితే తప్ప, వచ్చే వారం స్టాక్ మార్కెట్ నష్టాల బారి నుంచి బయటపడే అవకాశం లేదు. రూపాయి మారకపు విలువ పతనం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పెరుగుదల, చైనా-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం వంటి అంశాలు సస్సెక్స్‌పై ప్రభావం చూపుతున్నాయి. శుక్రవారం మదుపరుల ఆలోచనా సరళి, ప్రపంచ మార్కెట్ తీరుతెన్నులు, సూచీలు ఏ విధంగా ఉంటాయనేది ఎవరి అంచనాలకు అందడం లేదు. మొత్తం మీద ఈ వారం మిగిలి చివరి రోజున బుల్ పరుగులు పెడుతుందా లేక ఇంతకు ముందులానే కుంటుతుందా అన్నది చూడాలి.