బిజినెస్

పసిడికి తగ్గిన డిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10: పండుగ సీజన్‌కు ముందు దేశీయ నగల వ్యాపారుల నుంచి వెల్లువెత్తిన డిమాండ్ కారణంగా ఒకానొక దశలో ఆరు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా భారీ ధర పలికిన బంగారం ఆతర్వాత బలహీనపడింది. అంతర్జాతీయ మార్కెట్ సూచీలు కూడా నీసరపడిన నేపథ్యంలో, ఈవారం మొత్తం మీద 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 580 రూపాయలు తగ్గి, 32,070 రూపాయల వద్ద ముగిసింది. పన్ను రేటును అమెరికా ఫెడరల్ రిజర్వ్ పెంచకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా బులియన్ మార్కెట్ పతనాన్ని చవిచూసింది. దాని ఫలితం భారత్‌పైన కూడా పడింది. దసరా, దీపావళి సీజన్ డిమాండ్‌కు తెరపడడంతో బంగారం ధర మళ్లీ దిగొచ్చింది. వచ్చే వారం బులియన్ మార్కెట్‌లో భారీ మార్పులను ఆశించలేమని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు.