బిజినెస్

వెరిజోన్ చేతికి యాహూ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూలై 23: అమెరికా టెలికామ్ దిగ్గజం వెరిజోన్ కమ్యూనికేషన్స్.. ఇంటర్నెట్ దిగ్గజం యాహూను కొనుగోలు చేస్తోందా? 5 బిలియన్ డాలర్లకు యాహూను చేజిక్కించుకుంటోందా?. గూగుల్, ఫేస్‌బుక్ ధాటికి తట్టుకోలేకపోయిన యాహూ తమ వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టినది తెలిసిందే. దీంతో యాహూను సొంతం చేసుకునేందుకు ప్రముఖ సంస్థలు పోటీపడగా, వెరిజోన్‌తోపాటు ఎటిఅండ్‌టి-క్వికెన్ లోన్స్ వ్యవస్థాపకుడు డాన్ గిల్బర్ట్, విక్టర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, టిపిజి సంస్థల మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే వెరిజోన్ కమ్యూనికేషన్స్ ఈ రేసులో ముందుండగా, 5 బిలియన్ డాలర్లతో (ప్రస్తుతం భారత కరెన్సీ విలువ ప్రకారం 33,500 కోట్ల రూపాయలు) యాహూ కోర్ ఇంటర్నెట్ బిజినెస్ కొనుగోలుకు వెరిజోన్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కాగా, యాహూ పేటెంట్స్ ఈ డీల్‌లో లేవని పేరు చెప్పడానికి ఇష్టపడని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయన్న సదరు వ్యక్తులు.. యాహూ రియల్ ఎస్టేట్ తదితర ఇతర ఆస్తులు డీల్‌లో ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటివరకైతే ఎలాంటి ఒప్పందాలు ఇరు సంస్థల మధ్య జరగలేదని, వీలైనంత త్వరలోనే జరగవచ్చని చెప్పారు. ఇదిలావుంటే దీనిపై స్పందించేందుకు వెరిజోన్ వర్గాలు నిరాకరించాయి. మరోవైపు యాహూ వర్గాలు అందుబాటులో లేవు. ఇకపోతే యాహూ కొనుగోలు వెరిజోన్ ఎఒఎల్ ఇంటర్నెట్ బిజినెస్‌కు ఊపునిస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఎఒఎల్‌తో వెరిజోన్ ఆధ్వర్యంలోని కొత్త యాహూ.. ఇంటర్నెట్ రంగాన్ని ఏలుతున్న గూగుల్, ఫేస్‌బుక్‌లకు గట్టి పోటీనే ఇవ్వగలదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేగాక వెరిజోన్ డీల్ కుదిరితే యాహూ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ పరికరాల వినియోగానికి ఎఒఎల్‌కు అనుమతి కూడా లభిస్తుంది. ఎఒఎల్‌ను నిరుడు 4.4 బిలియన్ డాలర్లతో వెరిజోన్ కొనుగోలు చేసింది. ఫ్లికర్, టంబ్లర్, యాహూ ఫైనాన్స్, స్పోర్ట్స్ తదితర వెబ్‌సైట్లను కలిగి ఉన్న యాహూకు మిలియన్ల సంఖ్యలో యూజర్లున్నది తెలిసిందే.