బిజినెస్

సంఘర్షణకు స్వస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 19: కేంద్ర ప్రభుత్వానికి భారత్ రిజర్వ్ బ్యాంకుకు మధ్య తలెత్తిన సంఘర్షణ వాతావరణానికి దాదాపుగా తెరపడినట్టే. సోమవారం నాడిక్కడ తొమ్మిదిన్నర గంటలకు పైగా జరిగిన ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు దాదాపుగా కేంద్ర ప్రభుత్వ డిమాండ్లను అంగీకరించినట్టుగానే సాగాయి. ఈ సమావేశంలో సంచలన నిర్ణయాలు ఉంటాయని ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, డిప్యూటీ గవర్నర్ ఆచార్యలకు సంబంధించి ప్రతికూల పరిస్థితులు తలెత్తవచ్చునన్న ఊహాగానాలకు తెరపడింది. దాదాపు 8 వేల కోట్ల రూపాయల మేర ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయాలని ఈ సమావేశం నిర్ణయించడం, అలాగే కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అనేక అంశాలపైన చర్చించడానికి అంగీకరించడంతో సంఘర్షణ వాతావరణం సమసిపోయింది. ద్రవ్యలభ్యత సమస్యను సరళతరం చేసేందుకే బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఈ సమావేశంలో జరిగిన చర్చలకు వ్యక్తిగతంగా ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటల్ శ్రద్ధ వహించారు. మొత్తం 20 అంశాలతో కూడిన అజెండాలో నాలుగు డిమాండ్లపై చర్చించేలా ప్రభుత్వం ఒత్తిడి తేగలిగింది. వీటిలో లిక్విడిటీ సమస్యను తొలగించడం, పనితీరు మెరుగైన బ్యాంకులకు సంబంధించి తక్షణ దిద్దుబాటు చర్యలను తీసుకోవడం, ఆర్‌బీఐ రిజర్వ్‌లను కేంద్రానికి బదిలీ చేయడం, దాదాపు 25 వేల కోట్ల వరకు నిరర్ధక ఎస్‌ఎంవి రుణాలలో సరళతర వెసులుబాటును కల్పించడం వంటివాటిపై ప్రభుత్వం ఒత్తిడి తేగలిగింది. కంటింజెన్సీ ఫండ్ రూపంలోనూ ఫోరెక్స్ నిధులు, గోల్డ్ రిజర్వ్‌లు, సెక్యూరిటీల పరంగా ఆర్‌బీఐ వద్ద 9.6 లక్షల కోట్ల రిజర్వ్‌లు ఉన్నాయి. అంటే ఆర్‌బీఐ మొత్తం ఆస్తుల్లో ఇది 28 శాతం. అయితే ఆర్‌బీఐకి 15 నుంచి 16 శాతం రిజర్వ్ ఉంటే సరిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ రిజర్వ్‌లను కేంద్రానికి బదిలీ చేసే అంశంపై ఒక కమిటీ వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం దేశఅవసరాలకు సరిపడేలా ద్రవ్యలభ్యత ఉందని ఆర్‌బీఐ భావిస్తుండగా, కేంద్రం మాత్రం దాదాపు లక్ష కోట్ల రూపాయల మేర ద్రవ్య లభ్యత లోటు ఉందని గట్టిగా చెబుతోంది. ఎస్‌బిఐ ఇటీవల తన నివేదికలో దేశంలో ద్రవ్యలభ్యత లోటు దాదాపు 90 వేల కోట్ల రూపాయలు ఉందని స్పష్టం చేసింది. ఈ పరిస్థితిని మెరుగుపర్చడానికి అంగీకరించిన ఆర్‌బీఐ ఇందులో భాగంగానే 8వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను కొనేందుకు నిర్ణయించడం గమనార్హం. ఏదో జరిగిపోతుందనుకున్న ఆర్‌బీఐ బోర్డు సమావేశం సానుకూల వాతావరణంలో ముగియడంతో ఆర్థిక మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. అదేవిధంగా దేశీయ, ఇతర ఇనె్వస్టర్లలో నెలకొన్న అనిశ్చితి కూడా తొలగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లకు సానుకూల సంకేతాలను అందించడానికి దేశంలో ఆర్థిక వాతావరణం సజావుగా ఉందని చెప్పడానికి ఈ సమావేశం బలమైన సంకేతాలే ఇచ్చింది.