బిజినెస్

ఎంపీటీకి రూ.242 కోట్లు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: ముంబయి పోర్టు ట్రస్ట్ (ఎంపీటీ)కు 242 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించాలని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ)ని మేజర్ పోర్ట్స్ టారిఫ్ అథారిటీ (టామ్ప్) ఆదేశించింది. ముడిచమురు (క్రూడ్ ఆయిల్)ను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఓడరేవుకు అనుబంధంగా ఏర్పాటు చేసిన రెండు పైప్‌లైన్ల ద్వారా రవాణా చేసినందుకుగాను ఈ పరిహారం చెల్లించాలని టామ్స్ ఆదేశాల్లో పేర్కొంది. అక్టోబర్ 3లోగా ఈ పరిహారం చెల్లించాలని సైతం డెడ్‌లైన్ విధించింది. కాగా ఈ ఆదేశాలకు సంబంధించిన క్లెయిమ్‌లో పరిపాలనా పరమైన అంశాలను పరిశీలిస్తున్నామని ఓఎన్‌జీసీ ఈ సందర్భంగా పేర్కొంది. 2013-14 నుంచి మారిన వేర్‌ఫేజ్ పరిహార చార్జీల ప్రకారం 173.69 కోట్ల రూపాయలు చెల్లించాలని, అలాగే దీనిపై వడ్డీని అప్పటి వడ్డీరేటు 18 వాతం ప్రకారం కలుపుకుని మరో 241.69 కోట్ల రూపాయలు చెల్లించాలని టామ్ప్ ఆదేశించింది. కాగా ముంబయిలోని స్థానిక రీఫైనరీలకు ముండిచమురు సరఫరాకు సంబంధించి వార్‌ఫేజ్ పరిహార చెల్లింపు విషయం చాలాకాలంగా తమకు ముంబయి పోర్టు ట్రస్టుకు మధ్య సాగుతోందని ఓఎన్‌జీసీ పేర్కొంది. లోకల్ రీఫైనరీలకు పైప్‌లైన్ల ద్వారా, తీరప్రాంత రీఫైనరీలకు జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌పీటీ)లో లోడింగ్ జరిపి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని ఓఎన్‌జీసీ వివరించింది. అలాగే పైప్‌లైన్ల ద్వారా సరఫరా చేసినందుకు సంబంధించిన ‘వే లీవ్’ చార్జెస్ కూడా పెండింగ్ ఉన్న విషయం వాస్తవమేనని కంపెనీ స్పష్టం చేసింది. 2005లో పైప్‌లైన్ వేసే సమయంలో తమ కంపెనీ ముంబయి పోర్టు ట్రస్ట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 231.42 కోట్ల రూపాయలు చెల్లించిందని, ప్రస్తుతం మేజర్ పోర్టుల టారిఫ్ అథారిటీ (టామ్ప్) ఆదేశానుసారం చెల్లించాల్సిన పరిహారంపై పరిపాలనా పరమైన అంశాలపై పరిశీలన జరుగుతోందని ఓఎన్‌జీసీ వివరించింది.