బిజినెస్

ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ రవాణా విభాగం త్రైమాసిక ఫలితాల ప్రకటనలో ఆలస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: కష్టాల్లో కూరుకుపోయిన ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ గ్రూప్‌లోని రవాణా నెట్‌వర్క్స్ విభాగం గడచిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంలో ఆలస్యం అవుతోంది. ఎన్‌సీఎల్‌టీ ఇన్‌సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ కారణంగానే త్రైమాసిక ఆర్థిక పరిస్థితులను స్టాక్ ఎక్చేంజీల్లో ఫైల్ చేయడంలో ఆలస్యం జరిగిందని ఆ విభాగం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలో తమ వివరాలను ప్రకటిస్తామని చెలిపింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల మార్గదర్శకాల మేరకు ప్రతి కంపెనీ త్రైమాసిక పద్ధతిలో ప్రతి 45 రోజులకు ఓ సారి ఆర్థిక స్థితిగతులను ప్రకటించాల్సివుంది. ఐతే ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌కు కొత్తగా ఏర్పాటైన పాలక బోర్డు రోడ్డు మ్యాప్ తయారీలో తలమునకలై ఉంది. ఇందులో భాగంగా ఇందులోని రవాణా విభాగం ఆస్తుల పటిష్టత, అభివృద్ధి, పునర్నిర్మాణం, అండర్‌టేకింక్ వంటి అంశాలను ఎలా అములు చేయాలన్న విషయంపై ప్రత్యేకంగా కృషి జరుగుతోంది. ఇది ఐటీఎన్‌ఎల్ ఆర్థిక స్థితిగతులను మార్చే అవకాశాలున్నాయని, అందుకే సెప్టెంబర్‌తో ముగిసే త్రైమాసిక ఫలితాల ప్రకటనలో ఆలస్యం జరిగిందని కంపెనీ బీఎస్‌ఈకి సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. అంతేకాకుండా కంపెనీ ఆర్థిక స్థితిగతులకు చెందిన అకౌంటింగ్ సిస్టమ్స్, డ్రైవ్స్ అనేక వారాలుగా దర్యాప్తు సంస్థల వద్ద ఉన్నందున తమకు అందుబాటులో లేకుండాపోయాయని కొత్త బోర్టు వివరణ ఇచ్చింది.