బిజినెస్

డిస్కవరీ 100సీసీ విడుదలే మా అతిపెద్ద తప్పిదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 22: బజాజ్ ఆటో సంస్థ నుంచి డిస్కవరీ 100 సీసీ బైక్‌ను విడుదల చేయడం తాము చేసిన అతిపెద్ద తప్పిదమని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ గురువారం నాడిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. ఈ నిర్ణయం తమ కంపెనీని రెండో స్థానానికి దిగజార్చిందని ఆయన చెప్పారు. డిస్కవరీని విభిన్నమైన ఉత్పత్తిగా 125సీసీ ఫార్మేట్‌లో విడుదల చేసినపుడు అధిక మైలేజీ ఉంటుందని ఇచ్చిన ప్రకటనను ఆయన గుర్తుచేస్తూ అతి ఒక చిన్న హాస్యాస్పద వ్యవహారమని పేర్కొన్నారు. ఐతే ఇప్పటికీ బైక్‌ల వాల్యూమ్ విషయానికి వస్తే తమ కంపెనీ రెండో స్ధానంలో ఉందని అన్నారు. ఇలా స్థాయి దిగజారడం డిస్కవరీ లోయర్ వేరియంట్ విడుదల వల్లే జరిగిందని స్పష్టం చేశారు. 125 సీసీకి మంచి డిమాండ్ ఉన్న సమయంలో 100 సీసీని విడుదల చేయాల్సిన అవసరం ఏమిటని పలువురు సూచించినా పెడచెవినిపెట్టి 100సీసీని విడుదల చేశామని రాజీవ్ బజాజ్ చెప్పారు. ఈ నిర్ణయం సత్ఫలితాల్చివుంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నారు. ఇందువల్ల కంపెనీ స్థాయితోబాటు ఐదేళ్ల తర్వాత సామర్ధ్యం కూడా పడిపోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.