బిజినెస్

మార్కెట్‌లోకి టీవీఎస్ నూతన వాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 22: గృహ, వాణిజ్య అవసరాలకు అనుగుణంగా టీవీఎస్ నూతనంగా రూపొందించిన టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 హెవీడ్యూటీ ఐ టచ్ స్టార్ట్ వాహనం మార్కెట్‌లోకి విడుదల చేశారు. మొబైల్ చార్జింగ్ యూనిట్ ఉండటం దీని ప్రత్యేకత. నగరంలో జరిగిన కార్యక్రమంలో టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 ‘ఐ టచ్ స్టార్ట్’ వాహనంను యుటిలిటీ ప్రోడక్ట్స్ సంస్థ ఉపాధ్యక్షుడు వైద్యనాథన్, కంపెనీ ప్రతినిధి బాలాజీలు మార్కెట్‌లోకి విడుదల చేశారు. వాహనం ధర రూ.37,649 (ఎక్స్ షోరూం). ఇప్పటి వరకు ఉత్తర భారత దేశానికే పరిమితమైన ఈ వాహనాన్ని మొట్ట మొదటి సారి దక్షిణా భారతేశంలో హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. దేశంలోనే తొలిసారిగా ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ సిస్టమ్ (ఐఎస్‌జీ) సాంకేతికతను ఈ వాహనం ద్వారా అందుబాటులోకి వచ్చిందని వైద్యనాథ్ తెలిపారు.

చిత్రం..టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 వాహనాన్ని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్న యుటిలిటీ ప్రోడక్ట్స్ ఉపాధ్యక్షుడు వైద్యనాథన్