బిజినెస్

ఆరంభ లాభాలు ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 22: తాజాగా విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొన్న బలహీన ధోరణి మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లలో గురువారం లోహ, పీఎస్‌యూ, వాహన, బ్యాంకింగ్ రంగాల షేర్లు తీవ్రమయిన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో మార్కెట్ కీలక సూచీలు పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ గురువారం ఊగిసలాట మధ్య సాగిన లావాదేవీలలో ఆరంభంలో పుంజుకున్నప్పటికీ, తరువాత ఆ లాభాలను నిలబెట్టుకోలేక పోయింది. 200కు పైగా పాయింట్లు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా 73 పాయింట్లు దిగజారింది. గురువారం ఉదయం ఎగువ స్థాయి 35,282.33 పాయింట్ల వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ తరువాత రూపాయి మరింత బలపడిన తరుణంలో దేశీయ మదుపరుల నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతు వల్ల మరింత ముందుకు సాగుతూ ఇంట్రా-డేలో 35,364.50 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, ఐరోపా స్టాక్ మార్కెట్లు దిగువ స్థాయి వద్ద ప్రారంభం కావడంతో పాటు అధిక స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ఈ సూచీ ప్రతికూల జోన్‌లోకి జారిపోయి, 34,937 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 218.78 పాయింట్ల (0.62 శాతం) దిగువన 34,981.02 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం రెండు సెషన్లలో కలిసి 575 పాయింట్లు పడిపోయింది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా గురువారం 73.30 పాయింట్లు (0.69 శాతం) పడిపోయి, 10,526.75 పాయింట్ల వద్ద ముగిసింది. గురునానక్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మార్కెట్లకు సెలవు ప్రకటించారు. సెనె్సక్స్, నిఫ్టీ రెండూ కూడా గురువారంతో ముగిసిన ఈ వారంలో నష్టపోయాయి. సెనె్సక్స్ ఈ వారంలో 476.14 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 155.45 పాయింట్లు తగ్గింది. ఆరంభంలో ఆర్జించిన లాభాలను నిలబెట్టుకోవడంలో మార్కెట్లు విఫలమయ్యాయని, ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో పాటు లోహ, పీఎస్‌యూ, వాహన, బ్యాంకింగ్ రంగాల షేర్లు తీవ్రమయిన అమ్మకాల ఒత్తిడికి లోనుకావడంతో కీలక సూచీలు పడిపోయాయని విశే్లషకులు పేర్కొన్నారు.
గురువారం నాటి లావాదేవీలలో సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో ఎంఅండ్‌ఎం అత్యధికంగా 3.02 శాతం నష్టపోయింది. టాటా స్టీల్ 2.28 శాతం నష్టపోయి తరువాత స్థానంలో నిలిచింది. నష్టపోయిన ఇతర సంస్థల్లో విప్రో, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్, వేదాంత, టాటా మోటార్స్, సన్ ఫార్మా, రిల్, ఆసియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, ఐటీసీ, ఇన్ఫోసిస్ ఉన్నాయి. వీటి షేర్ల విలువ 2.10 శాతం వరకు పడిపోయింది. మరోవైపు, అదాని పోర్ట్స్, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల విలువ 1.73 శాతం వరకు పెరిగింది.