బిజినెస్

కంపెనీ షేర్ల బై బ్యాక్‌కు ఆయిల్ ఇండియా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: పబ్లిక్ ఇష్యూలో అమ్మిన షేర్లలో 4.45 శాతం వాటాలను తిరిగి కొనేందుకు ఆయిల్ ఇండియా సిద్ధమైంది. 1,085 కోట్ల రూపాయలను చెల్లించి తిరిగి కొననుంది. పబ్లిక్ రంగ సంస్థలతోపాటు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు కూడా ద్రవ్య లబ్ధత తగినంత లేకపోవడంతో దారుణంగా నష్టపోతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన కేంద్రం మార్కెట్‌లో ద్రవ్యాన్ని అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా షేర్ల బై బ్యాక్‌కు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నట్టు ప్రకటించింది. 10 రూపాయల ఆయిల్ ఇండియా షేర్ విలువ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అదే కంపెనీ గతంలో జారీ చేసిన షేర్లలో 4.45 శాతాన్ని తిరిగి కొనుగోలు చేసేందుకు, ఒక షెర్‌కు 215 రూపాయలు చెల్లించనుంది. స్టాక్ మార్కెట్‌లో ఈ షేర్ ధర ప్రస్తుతం 218.78 రూపాయలు.
ఆయిల్ ఇండియా వద్ద సుమారు 20,000 కోట్ల రూపాయల రిజర్వ్ నిధులు ఉన్నాయి. అత్యవసరాల్లో ఈ మొత్తాల్లో కొంత భాగాన్ని వెచ్చించే వీలు ఉంది. ఆ నిబంధనను అనుసరించి, షేర్ల బై బ్యాక్‌కు ఆయిల్ ఇండియా ఉపక్రమించింది. గురునానక్ జయంతి కారణంగా శుక్రవారం బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్‌కి సెలవు. శని, ఆది వారాల్లో కూడా స్టాక్ మార్కెట్ ఉండదు. ఈ కారణంగా కూడా మార్కెట్‌లో ద్రవ్య లబ్ధత క్షీణించింది. అందుకే, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బై బ్యాక్ విధానంలో కనీసం 5,000 కోట్ల రూపాయలను మార్కెట్‌లో విడుదల చేయాలని కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. కేంద్ర ఆదేశాల మేరకు ఇండియన్ ఆయిల్‌తోపాటు కోల్ ఇండియా, బీహెచ్‌ఈఎల్ వంటి భారీ సంస్థలు కూడా బై బ్యాక్ నిర్ణయాన్ని ప్రకటించాయి. ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌ఎల్‌సీ, కొచ్చిన షిప్‌యార్డ్, కేఐఓసీఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వాటాలను తిరిగి కొంటున్నాయి. కొన్ని కంపెనీలు సెబీ ఆమోదాన్ని కూడా పొందాయి. మొత్తం మీద ఈ కంపెనీలకు సుమారు 3,000 కోట్ల రూపాయల విలువైన షేర్లు తిరిగి వస్తాయని, ఆయా కంపెనీల నుంచి మార్కెట్‌కు ద్రవ్యం అందుబాటులోకి వస్తుందని కేంద్రం ఆలోచన. శని, ఆది వారాల్లో కూడా స్టాక్ మార్కెట్ ఉండదు కాబట్టి, సోమవారం నుంచి బై బ్యాక్ ఉద్ధృతి నేపథ్యంలో లావాదేవీలు ఏ విధంగా ఉంటాయన్నది ఆసక్తిని రేపుతున్నది.

నాల్కో సైతం..
ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపనీ (నాల్కో) రూ. 505 కోట్ల విలువ గల షేర్లను తిరిగి వెనక్కి తీసుకుంటానని ప్రకటించింది. ‘తన షేర్లను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియ ఈనెల 13న మొదలయింది. ఇది 28 తేదీ వరకూ కొనసాగుతుందని నాల్కో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ (బీఎస్‌ఈ)కి సమర్పించిన ఒక పత్రంలో వెల్లడించింది. నాల్కో విక్రయించిన తన షేర్లలో రూ. 504.8 కోట్ల విలువయిన షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని నాల్కో గత నెలలో ప్రకటించింది. ‘6,73,11,386కు మించకుండా ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను అక్టోబర్ 12వ తేదీన జరిగిన సమావేశంలో డైరెక్టర్ల బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి రూ. 500 కోట్లకు మించకుండా వ్యయం చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది’ అని నాల్కో బీఎస్‌ఈకి ఇది వరకే వివరించింది.