బిజినెస్

ముడి చమురు ధర పతనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 24: ముడి చమురు ధర పతనం అంతర్జాతీయ మార్కెట్‌ను భయాందోళనకు గురి చేస్తున్నది. నిన్న మొన్నటి వరకూ అదుపులోకి రాకుండా ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసిన క్రూడ్ ఆయిల్ ధర పతనం ప్రారంభమైంది. డిమాండ్‌ను మించిన సప్లయి పెరుగుదల ఈ పతనానికి కారణం. ఇరాన్ నుంచి పెట్రో ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా డిమాండ్ పతనమవుతున్న విషయం తెలిసిందే. కొన్ని దేశాలకు అమెరికా మినహాయింపు ఇచ్చినప్పటికీ, స్థూలంగా చూస్తే చమురు ఉత్పత్తి కంపెనీలు లాభపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ముడి చమురు ఉత్పత్తి, సప్లయి, డిమాండ్ తదితర అంశాలను నిరంతరం పరిశీలించి, విశే్లషించి, నివేదికలను జారీ చేసే వెస్ట్ టెక్సాస్ ఇంటర్‌మీడియట్ (డబ్ల్యూటీఐ) సైతం ఇలాంటి అభిప్రాయానే్న వ్యక్తం చేస్తున్నది. అమెరికాలో డబ్ల్యుటీఐ మాదిరి యూరోపియన్ యూనియన్‌లో చురుగ్గా ఉన్న బ్రెంట్ క్రూడ్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో ముడి చమురు డిమాండ్ తగ్గుతున్నదని స్పష్టం చేసింది. గత ఏడాదిలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం ఒక్కసారిగా డిమాండ్ ఆరు శాతం తగ్గడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అమెరికా, ఐరోపా నుంచే గల్ఫ్ దేశాలకు క్రూడ్ ఆయిల్ సరఫరా ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కాలంలో ప్రత్యామ్నాయ ఇంథన వనరులు అందుబాటులో రావడం, చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించడం వంటి అంశాలు మార్కెట్‌ను ప్రభావిం చేస్తున్నాయి. గతేఏడాది డిసెంబర్‌లో జరిగిన ఒపెక్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు చమురు ఉత్పత్తులను తక్కువ చేసే ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం ఉత్పత్తికి సరిపడా డిమాండ్ లేకపోవడంతో చమురు ధర పతనం మొదలైంది. బ్యారెల్‌కు యాభై డాలర్ల వరకూ ధర తగ్గడం రాబోయే రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలకు తార్కాణమని అంటున్నారు. రష్యా, సౌదీ అరేబియా నుంచి చమురు ఉత్పత్తి భారీగా పెరుగుతుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు, తీసుకుంటున్న చర్యలు కూడా ధరలు తగ్గడానికి కారణమైంది. మొత్తం మీద ముడి చమురు ధర మరింతగా పతనమయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.