బిజినెస్

జెట్ ఎయిర్‌వేస్ కాంప్లిమెంటరీ సేవలకు తాత్కాలికంగా బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 24: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అల్లాడుతున్న జెట్ ఎయిర్‌వేస్ ఖర్చును తగ్గించుకునే పనిలో పడింది. అందులో భాగంగానే ప్లాటినం, గోల్డ్ కార్డు సభ్యులకు ఇంత వరకూ అందిస్తున్న కాంప్లిమెంటరీ లాంజ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే ఈ కార్డు కలిగిన వారికి ప్రత్యేక సేవలు జెట్ ఎయిర్‌వేస్ అందిస్తున్నది. అయితే, విమానాలకు వాడే పెట్రోలు ధర పెరగడం, రూపాయి మారకపు విలువ పడిపోవడం వంటి కారణాలతో నష్టాలు పెరుగుతూ, సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు సాధ్యమైనంత వరకూ ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. కాంప్లిమెంటరీ సర్వీసులను నిలిపివేయడంతో ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కాంప్లిమెంటరీ లాంజ్ సేవలు తాత్కాలికంగా రద్దవుతున్నాయని జెట్ ఎయిర్‌వేస్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. దీనిని ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయాన్ని ప్రస్తావించలేదు. తదుపరి వివరాలను తెలుసుకునేందుకు జెట్ అధికారులను సంప్రదించడానికి పీటీఐ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.