బిజినెస్

బ్యాంకులకు మేమిచ్చేదేమీ లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 25: విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్.. సోమవారం బ్యాంకుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. తమతో జరిగిన మాస్టర్ డెట్ రీస్ట్రక్చరింగ్ అగ్రిమెంట్ (ఎమ్‌డిఆర్‌ఎ) షరతులను బ్యాంకులు మీరాయని, అనవసరమైన రాద్ధాంతంతో తమ వ్యాపారాన్ని దెబ్బతీశాయని అసహనం వ్యక్తం చేసింది.
కాబట్టి బ్యాంకుల నుంచి మేము తీసుకున్న 6,000 కోట్ల రూపాయలకుపైగా రుణాలను తిరిగి చెల్లించేది లేదని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తరఫు న్యాయవాది డిఆర్‌టి ప్రిసీడింగ్ అధికారి సిఆర్ బెనకననహల్లి ఎదుట అన్నారు. బ్యాంకుల ప్రవర్తన దృష్ట్యా తమ సంస్థకు ఏర్పడిన నష్టానికిగాను తమ నుంచి బ్యాంకులు కోరుతున్న బకాయిలను చెల్లించరాదని స్పష్టం చేయాలంటూ డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డిఆర్‌టి)ను కోరారు.
మాల్యాకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన లిక్కర్ దిగ్గజం డియాజియో నుంచి తీసుకున్న 45 మిలియన్ డాలర్లతోసహా తన మొత్తం ఆస్తుల వివరాలేమీ విజయ్ మాల్యా తెలియపరచడం లేదని అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగీ సోమవారం సుప్రీం కోర్టుకు తెలిపారు. కోర్టు ఉత్తర్వులను కూడా ఆయన గౌరవించడం లేదంటూ జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌లతో కూడిన ధర్మాసనానికి చెప్పారు. మాల్యాపై కోర్టు విచారణ ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని బ్యాంకుల కూటమి దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో రోహ్తగీ తెలిపిన వివరాలతో మాల్యాకు తాజాగా మరోమారు నోటీసులను జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. నాలుగు వారాల్లోగా స్పందించాలని మాల్యాను ఆదేశించింది.
కాగా, ఈ నెల 14న రోహ్తగీ మాట్లాడుతూ సీల్డ్ కవర్‌లో మాల్యా తన ఆస్తులకు సంబంధించి తప్పుడు వివరాలను సుప్రీం కోర్టుకు అందించారని అన్నది తెలిసిందే. అంతకుముందు బ్యాంకులు కూడా దర్యాప్తునకు మాల్యా సహకరించడం లేదని పేర్కొన్నదీ విదితమే. చివరకు సుప్రీం కోర్టు ఆదేశాలనూ మాల్యా బేఖాతరు చేశాడు. ఏప్రిల్ 21లోగా దేశ, విదేశాల్లో తనకు, తన కుటుంబీకులకు ఉన్న ఆస్తుల వివరాలను సమర్పించాలని కోర్టు ఆదేశించడంతో మాల్యా సీల్డ్ కవర్‌లో వివరాలను అందించాడు. అవన్నీ కూడా తప్పుడు వివరాలనీ రోహ్తగీ అన్నారు. ఇక ఎస్‌బిఐసహా 17 బ్యాంకుల నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ద్వారా 9,000 కోట్ల రూపాయలకుపైగా రుణాలు తీసుకుని, వాటిని చెల్లించకుండానే మాల్యా విదేశాలకు పారిపోయాడు. రుణాలకు పూచీకత్తుగా తనఖా పెట్టిన ఆస్తులను బకాయిల వసూళ్లలో భాగంగా బ్యాంకులు వేలం వేస్తున్నప్పటికీ సత్ఫలితాలు రావడం లేదు. ఈ క్రమంలో తీసుకున్న రుణాలు, దానికి వడ్డీ మాత్రం ఇస్తే చాలని, వడ్డీపై వడ్డీలు చెల్లించాల్సిన అవసరం లేదని బ్యాంకులు చివరకు ఓ అవకాశాన్నీ మాల్యాకు ఇచ్చినప్పటికీ ఫలితం శూన్యమే అయ్యింది.