బిజినెస్

స్థిరంగా సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 24: బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లో ఈ వారం నాలుగు రోజుల లావాదేవీలు మాత్రమే సాధ్యంకాగా, సెనె్సక్స్ దాదాపుగా స్థిరంగా కొనసాగింది. దేశ, విదేశీ వాణిజ్య రంగాల్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ఆశనిరాశల మధ్య జరిగింది. అయితే, చెప్పుకోదగ్గ నష్టాలుగానీ, భారీ లాభాలుగానీ నమోదు కాలేదు. ఈవారం మొదటి రోజున 35,562.87 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్ తర్వాతి రోజు 35,696.65 పాయింట్లుగా నమోదైంది. తర్వాతి రోజు స్వల్పంగా తగ్గి, 35,273.91 పాయింట్ల వద్ద ముగిసింది. గురువారం సెనె్సక్స్ 35,335.76 పాయింట్లకు చేరింది. గురునానన్ జయంతి సందర్భంగా శుక్రవారం మార్కెట్‌కు సెలవుకాగా, శని, ఆదివారాల్లో ట్రేడింగ్‌లు ఉండవు. దీనితో సోమవారం నాటి మార్కెట్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ముడి చమురు ధర కొద్దిగా తగ్గడం మినహా అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ మార్పులు ఏవీ చోటు చేసుకోకపోవడంతో ఈవారం స్టాక్స్ లావాదేవీలు స్థిరంగా కొనసాగాయి. అదే వచ్చే వారం ఇదే పరిస్థితి ఉంటుందని ఊహించడానికి వీల్లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రూపాయి మారకపు విలువ క్రమంగా నిలదొక్కుకుంటుండగా, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ద్రవ్య లబ్ధతను పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే ప్రభుత్వరంగ సంస్థల నుంచి షేర్ల బై బ్యాక్‌ను ముమ్మరం చేసింది. 5,000 కోట్ల రూపాయలు మార్కెట్‌లోకి రావాలన్నది కేంద్రం ఆలోచన. అందుకు అనుగుణంగా ఆర్‌బీఐ నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇదే పరిస్థితి కొనసాగితే, వచ్చే వారం మార్కెట్ మరింత పుంజుకుంటుందని, సెనె్సక్స్ 36,000 పాయింట్ల మైలురాయిని అధిగమిస్తుందని అంచనా.