బిజినెస్

రైళ్లలో పాంట్రీల తొలగింపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: దూర ప్రాంత రైలు ప్రయాణికులకు భోజన వసతి కల్పించే పాంట్రీ కార్‌ల సాంప్రదాయానికి తెరపడనుంది. ఈ విధానాన్ని రైల్వే శాఖ స్వస్తి చెప్పనుంది. పాంట్రీల నిర్వహణ భారం కావడం, ప్రధానంగా కోచ్‌ల కొరత, దీనిద్వారా వెదజల్లే కాలుష్యం వంటి అనేక కారణాలతో పాంట్రీలను పూర్తిస్థాయిలో తొలగించాలనే నిర్ణయానికి రైల్వే శాఖ వచ్చినట్టు తెలిసింది. దీనిపై ఆలోచన చేస్తున్న రైల్వే దశలవారీగా తొలగిస్తుందా? లేదంటే జోన్లు, డివిజన్ల స్థాయిల్లో ఒక్కో దానిని తొలగించుకుంటూ రానుందా? అనేది స్పష్టం కావాల్సి ఉంది. అందుబాటు ధరలతో భోజన వసతి సౌకర్యం కల్పించడం కోసం, కొద్దిసేపు మాత్రమే నిలిచే ఆయా రైల్వేస్టేషన్లలో దిగే అవకాశం లేని పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్న రైల్వేశాఖ కొనే్నళ్ల నుండి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో పాంట్రీలను నిర్వహిస్తోంది. పాంట్రీ కార్‌లో ఒక వంట కుక్, సహాయకుడు, అటెండర్, టిఫన్, భోజనాలు సరఫరా చేసే సిబ్బంది, దీని నిర్వహణ బాధ్యతలు చూసే ఉద్యోగి కలిపి కనీసం ఆరుగురు ఉంటే తప్ప సాధ్యపడటంలేదు. రైల్వేలో పలు విభాగాల్లో పనిచేసే వారికి శిక్షణ ఇచ్చి మరీ పాంట్రీల నిర్వహణ జరిపేవారు. అలాగే ఔట్‌సోర్సింగ్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) సంయుక్త ఆధ్వర్యంలో పాంట్రీలు నడిచేవి. దీనివల్ల ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తేవి. జోన్లు, డివిజన్ల స్థాయిలో అందే ఫిర్యాదులు బుట్టదాఖలయ్యేవి. తప్పితే వీటిని పెద్దగా పట్టించుకునే పరిస్థితులు ఎనాడూ లేవు. వంట సామగ్రిని సమకూర్చడం, పసందైన వంటకాలు తయారుచేసి ప్రయాణికులకు అందించేందుకు ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యలో ఒక పాంట్రీని నిర్వహించడం రైల్వేకు భారమవుతూ వస్తోంది. పాంట్రీల నిర్వహణతో తీవ్ర కాలుష్యం, ప్రమాద సమస్యలు తలెత్తుతున్నట్టు ఫిర్యాదుల ద్వారా తెలుసుకోగలిగింది. స్టీమ్ ఇంజన్లు, డీజిల్ ఇంజన్లతో నడిచే రైళ్ళ ద్వారా వెదజల్లే కాలుష్యం కంటే కూడా పాంట్రీల వలన ఎదురయ్యే కాలుష్య సమస్యలపై ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తం కావడంతో దీనిపైన రైల్వే దృష్టి సారించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వీటన్నింటి కంటే కూడా ఇటీవల కోచ్‌ల కొరత రైల్వేను వేధిస్తోంది. భారతదేశంలో ఒక్క చెన్నై పెరంబూర్‌లోను, లేదంటే అగర్తలా ఇంటిగ్రేటివ్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్) నుంచి మాత్రమే కొత్త కోచ్‌లు తయారై ఆయా జోన్లకు రావాల్సి ఉంది. ఇందుకోసం ప్రతి ఏడాది ఆయా రైల్వేజోన్ల నుంచి రైల్వేబోర్డుకు ప్రతిపాదనలు అందుతుంటాయి. అయితే రిజర్వేషన్ బెర్తులకు ఉండే డిమాండ్, ప్రయాణికుల వినతులు, ప్రజాప్రతినిధుల సిఫారసులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సాధ్యసాధ్యాలను పరిశీలించిన మీదటే కొత్త కోచ్‌లను మంజూరు చేసే అవకాశాలు ఉంటున్నాయి. దీనివల్ల నెలలు, ఏళ్ళ తరబడి దేశంలో పలు రైల్వేజోన్ల పరిధిలో ఉండే డివిజన్లు కోచ్‌ల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ఈస్ట్‌కోస్ట్‌రైల్వే వాల్తేరు డివిజన్ గత ఆరేళ్ళ కాలంగా ఇదే సమస్యతో తలలు పట్టుకుంటుంది. చివరకు పండుగలు, వేసవి సీజన్లలోనూ అదనపు కోచ్‌లు సైతం ఏర్పాటు చేయడం సాధ్యపడటంలేదని, దీనివల్ల ప్రయాణికుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తోందంటూ ఇక్కడి రైల్వేవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోచ్‌ల కొరతను అధిగమించాలంటే కొత్త కోచ్‌లు పట్టాలెక్కే పరిస్థితులు కనిపించక పోవడంతో దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తున్న రైల్వే శాఖకు పాంట్రీ కార్‌ల తొలగింపు ఆలోచన వచ్చినట్టు తెలిసింది. వీటి తొలగింపు ద్వారా కొంతవరకైనా కోచ్‌ల కొరతను అధిగమించవచ్చని రైల్వే భావిస్తోంది. దీనికి సంబంధించి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడంతోపాటు వీటి తొలగింపు ద్వారా ప్రయాణికుల నుంచి భవిష్యత్‌లో ఎదురయ్యే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కాగా భారతీయ రైల్వేలో కొంకణ్ రైల్వేతోపాటు 17రైల్వేజోన్లు 50కి పైగా డివిజన్లు ఉన్నా యి. ఒక్క వాల్తేరుడివిజన్‌కు సంబంధించి వందకు మించి ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ళు నడుస్తున్నాయి. వీటిలో కేవలం దూరప్రాంతాల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లోనే పాంట్రీలను నిర్వహిస్తున్నందున 20నుంచి 30 శాతం మేర పాంట్రీ కార్‌లు ఉండవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అందువల్ల ఎక్కువ శాతం ప్ర యాణికులు వీటి తొలగింపును కోరుకుంటే ఆ క్ర మం లో చర్యలు చేపట్టాలనే అంశం తెరమీదకు వచ్చిం ది. మొత్తంమీద రానున్న రోజుల్లో పాంట్రీ కార్‌లు ఎక్కడా కనిపించకపోవచ్చని రైల్వేవర్గాలు అంటున్నాయి.