బిజినెస్

తగ్గిన యూరియా దిగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: యూరియా దిగుమతులు గణనీయంగా తగ్గాయి. అక్టోబర్ నెలలో 3.14 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా దేశంలోకి దిగుమతైంది. గత ఏడాది ఇదే నెల దిగుమతులు 5.14 లక్షల మిలియన్ టన్నులు. కాగా, గత ఏడాది నవంబర్‌లో అత్యధికంగా 8.43 లక్షల మిలియన్ టన్నుల యూరియాను దిగుమతి చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ఇది 6.20 లక్షల మిలియన్ టన్నులుగా నమోదైంది. అయితే, ఫిబ్రవరిలో అత్యంత కనిష్టంగా 0.44 మిలియన్ టన్నులకు పడిపోయింది. కానీ క్రమంగా పెరుగతో మార్చిలో 3.28, ఏప్రిల్‌లో 6.27, మేలో 7.28, జూన్‌లో 7.86 లక్షల మిలియన్ టన్నులుగా నమోదైంది. కానీ, జూలై 1.74, ఆగస్టులో 3.25 లక్షల మిలియన్ టన్నుల యూరియా మాత్రమే దిగుమతి అయింది. సెప్టెంబర్‌లో మరింత పెరిగి, 6.95 లక్షల మిలియన్లకు చేరింది. కానీ, అక్టోబర్‌లో 3.14 లక్షల మిలియన్లకు పతనమైంది. వ్యవసాయానికి సీజన్ కాకపోవడం, వర్షాలు సకాలంలో కురవకపోవడం వంటి అంశాలు యూరియా దిగుమతులు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు.