బిజినెస్

అజిత్ బాలాజీకి ప్రతినెలా 2.3 మిలియన్ వినియోగదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 25: వోన్డ్ ఒవర్ ది టాప్ (ఓటీటీ) పద్ధతిలో బాలాజీ టెలీ ఫిల్మ్స్ నిర్వహిస్తున్న అజిత్‌బాలాజీకి ప్రతినెలా 2.3 మిలియన్ల మంది చురుకైన వినియోగదార్లు సమకూరుతున్నారని బాలాజీ టెలీ ఫిల్మ్స్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, అజిత్ బాలాజీ సీఈవో నచికేత్ పంట్వైడ్యా తెలిపారు. వచ్చే రెండున్నరేళ్ల కాలంలో 150 కోట్ల ఆదాయం తమ సంస్థకు చేకూరుతుందని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం 8.9 మిలియన్ల మంది సబ్‌స్క్రైబ్ చేసుకున్నారని, గత యేడాది 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, ఈయేడాది ఇప్పటి వరకు మొదటి మూడు నెలల కాలానికే 7 కోట్ల రూపాయలు ఆదాయం రాగా గత సెప్టెంబర్ నాటికి మరో 14 కోట్ల రూపాయలు సమకూరాయని వివరించారు. తమ ఫాస్టర్ గ్రోత్ ఇంటర్నెట్ వినియోగదారులకు నమ్మశక్యంకాని అతితక్కుల రేట్లను ఆఫర్ చేస్తున్నామని ఆయన చెప్పారు. వ్యాపార విస్తరణలో భాగంగానే ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ యేడాది తమ యాప్ ద్వారా 32 షోలను పూర్తి చేయాలన్న లక్ష్యం ఉందని, ఇప్పటికే 24 షోలు పూర్తి చేశామని ఆయన వివరించారు.