బిజినెస్

నష్టాల్లో రిల్, టీసీఎస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: మార్కెట్‌లో వస్తుసేవల విలువ పతనం రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిల్), టీసీఎస్‌ను కూడా ప్రభావితం చేసింది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ వివరాల పరిశీలిస్తే రిల్ ఏకంగా 15,615 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఈ కంపెనీ వస్తుసేవలు విలువ 7,14,659 కోట్ల రూపాయల నుంచి 6,99,044 కోట్ల రూపాయలకు పడిపోయింది. అదే విధంగా టీసీఎస్ కూడా భారీగానే నష్టపోయింది. ఈ కంపెనీ వస్తుసేవల మార్కెట్ విలువలో 25,140 కోట్ల రూపాయల పతనం నమోదైంది. 7,06,292 కోట్ల రూపాయల నుంచి 6,81,152 కోట్ల రూపాయలకు పతనమైంది. హెచ్‌యూఎల్ 3,485, ఇన్ఫోసిస్ 13,104, ఎస్‌బీఐ 6,871, ఐసీఐసీఐ బ్యాంక్ 9,819 కోట్ల రూపాయల మేరకు నష్టాలను చవిచూశాయి. కాగా, లాభపడిన సంస్థల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఉంది. దాని మార్కెట్ విలువ 25,140 కోట్ల రూపాయలు పెరిగడంతో 5,43,136 కోట్ల నుంచి 5,45,025 కోట్ల రూపాయలకు ఎగబాకింది. ఐటీసీ 5,193 కోట్ల రూపాయలు, హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ 1,754 కోట్ల రూపాయలు, మారుతీ 2,354 కోట్ల రూపాయల వరకూ లాభపడ్డాయి.