బిజినెస్

భారత మూలధన మార్కెట్లలో పెరిగిన విదేశీ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: విదేశీ మదుపర్లు సుమారు 6,310 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు భారత మూలధన మార్కెట్లలో మదుపుచేశారు. గడచిన ఆక్టోబర్‌లో భారీగా ఉపసంహరణలు జరిగిన సంగతి తెలిసిందే. ముడిచమురు ధరలు తగ్గడంతోబాటు, డాలర్‌తో రూపాయి విలువ కూడా పెరగడం వంటి కారణాలు ఇందుకు దోహదం చేశాయని విశే్లషకులు అంచనా వేస్తున్నారు. ఇందులోప్రత్యేకించి అధిక నిధులను రుణాలకు సంబంధించిన మార్కెట్లలోకి ఫారిన్ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) మదుపు చేశారు. తాజాగా విడుదలైన డిపాజిటర్ల డేటా ప్రకారం గత అక్టోబర్ మాసంలో 38,900 కోట్ల రూపాయలు మదుపరులు ఉపసంహరించుకున్నారు. గత రెండేళ్ల కాలానికి ఇదే అతిపెద్ద ఉపసంహరణగా మారింది. గత సెప్టెంబర్ మాసంలోనూ విదేశీ మదుపర్లు సుమారు 21వేల కోట్ల రూపాయలు మూలధన మార్కెట్ల నుంచి ( రుణ, ఈక్విటీ మార్కెట్ల నుంచి) ఉపసంహరించుకోవడం జరిగింది. అంతకు ముందు జూలై, ఆగస్టు మాసాల్లో 7.500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. కాగా నవంబర్‌లో ఇప్పటి వరకు ఓవర్సీస్ ఇనె్వస్టర్లు 923కోట్ల రూపాయలు ఈక్విటీ మార్కెట్లలో మదుపు చేయడం జరిగింది. అలాగే రుణాలకు సంబంధించిన మార్కెట్లలో 5,387 కోట్ల రూపాయలు మదుపు చేశారు. ఇలావుండగా చమురు ధరల తరుగుదల, డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరుగుదల ప్రత్యేకంగా విదేశీ మదుపుదారులు తమ వ్యాపార వ్యూహాన్ని మార్చుకోవడానికి, తద్వారా ద్రవ్యలభ్యతకు దోహదం చేశాయని మార్నింగ్ స్టార్ ఇనె్వస్ట్‌మెంట్స్ అడ్వర్టయిజర్స్ ఇండియాకు చెందిన రీసెర్చ్ మేనేజర్, సీనియర్ అనలిస్ట్ హిమాంషు శ్రీవాత్సవ విశే్లషించారు. ఇలావుండగా అంతర్జాతీయంగా అమెరికా, చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం తాలూకు టెన్షన్లు ప్రస్తుత మార్కెట్లలో అనిశ్చితికి దారితీశాయని ఆయన చెప్పారు. ఇందువల్ల ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరిగేందుకు, క్లిష్టతర మార్కెట్లలో పెట్టుబడులకు వెనుకడుగు వేసేందుకు కారణమైందని, ఇందువల్ల మదుపరులు ఇతర ఆకర్షణీయమైన, సురక్షిత పెట్టుబడి మార్గాలను ఎంచుకున్నారని ఆయన చెప్పారు. ఐతే ఇప్పటి పరిస్థితి రానున్న నెలల్లో కొనసాగుతుందని, అనుకోవడం లేదని, డాలర్‌తో రూపాయి విలువ, ముడిచమురు ధరల పరిస్థితులతోబాటు, ప్రస్తుతం జరుగుతున్న రాష్ట్రాల ఉప ఎన్నిల ఫలితాలు, తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బట్టి విదేశీ పెట్టుబడుల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయని శ్రీవాత్సవ పేర్కొన్నారు. అంతేగాక ప్రస్తుతం భారత్‌తో పోలిస్తే చైనా, బ్రెజిల్ మార్కెట్ విలువలు అధికంగా ఉన్నాయని, దీన్ని సైతం మదుపరులు పరిగణలోకి తీసుకునే వీలుందని తెలిపారు. ఈ యేడాది ఇంతవరకు విదేశీ మదుపర్లు 94వేల కోట్ల రూపాయల పెట్టుబడులను మూలధన మార్కెట్ల నుంచి ఉపసంహరించుకోవడం జరిగిందని, ఇందులో 41వేల కోట్లు ఈక్విటీలనుంచి, మరో 53వేల కోట్లు రుణ మార్కెట్ల నుంచి ఉపసంహరణలు చోటుచేసుకున్నాయని వివరించారు.