బిజినెస్

ఎగుమతి రంగానికి నిధుల కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 27: ఎగుమతి రంగం నిధుల సమస్యను ఎదుర్కొంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేశ్ ప్రభు తెలిపారు. ఈ సమస్యను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లినట్టు ఆయన చెప్పారు. ఎగుమతి రంగానికి నిధులు తగ్గుతున్నాయని, అందువల్ల ఎగుమతిదారులకు తగినన్ని నిధులు అందుబాటులో ఉండేట్టుగా చూడాలని తాను ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరినట్టు సురేశ్ ప్రభు మంగళవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఎగుమతిదారులు పెరుగుతున్నారని, ఎగుమతుల వృద్ధి రేటును మరింత పెంచడానికి తమ మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. ‘ఎగుమతుల రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో నిధుల కొరత ఒకటి. ఎగుమతి రంగానికి నిధుల సరఫరా తగ్గింది. మేము ఈ సమస్యను ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లినాము.. ఎగుమతుల రంగంలోకి నిధుల ప్రవాహాన్ని మెరుగుపరచడం ఎలా? అనే అంశాన్ని ఆర్థిక మంత్రి పరిశీలిస్తున్నారని నేను అనుకుంటున్నాను’ అని సురేశ్ ప్రభు అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌ఐఈఓ) అధ్యక్షుడు గణేశ్ గుప్తా తరచుగా ఎగుమతి రంగానికి నిధుల సరఫరాను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నిధుల సరఫరా తగ్గిపోవడం వల్ల ఎగుమతుల వృద్ధి పడిపోతోందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులు ఎగుమతిదారులకు రుణాల మంజూరును ప్రాధాన్యత రంగంగా పరిగణించాలని మంత్రి సురేశ్ ప్రభు ఇదివరకే సూచించారు. ఒక అంచనా ప్రకారం, ఎగుమతిదారులకు ఇచ్చిన నికర రుణాల మొత్తం ఈ సంవత్సరం మార్చి 30నాటికి రూ. 28,300 కోట్లు ఉండగా, జూన్ 22 నాటికి రూ. 22,300లకు తగ్గింది. ఎగుమతులను పెంచడానికి ఎగుమతిదారులు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, తూర్పు ఆసియా, దక్షిణాసియా, మధ్య ప్రాచ్యం సహా విదేశాలలో నూతన మార్కెట్లను అనే్వషించాలని సురేశ్ ప్రభు సూచించారు.