బిజినెస్

బలపడిన రూపాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 27: రూపాయి మంగళవారం స్వల్పంగా బలపడింది. క్రితం ముగింపుతో పోలిస్తే మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఎనిమిది పైసలు పుంజుకొని, 70.79 వద్ద ముగిసింది. ఎగుమతిదారుల నుంచి డాలర్ల విక్రయం పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గడం రూపాయి స్వల్పంగా బలపడటానికి దోహదపడింది. అమెరికాతో పరస్పర ప్రయోజనకర ఒప్పందం గురించి చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించిన తరువాత ఎగుమతిదారులు, బ్యాంకుల నుంచి అమెరికన్ కరెన్సీ విక్రయాలు పెరగడం వల్ల రూపాయి విలువ పుంజుకుందని ఫోరెక్స్ ట్రేడర్లు చెప్పారు. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ (్ఫరెక్స్) మార్కెట్‌లో మంగళవారం అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ దిగువ స్థాయి 70.91 వద్ద ప్రారంభమయింది. డాలర్ పటిష్టంగా ఉండటంతో పాటు అమెరికాలో పెట్టుబడులపై ఆదాయాలు పెరుగుతుండటం, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలపై భయాందోళనలు పెరగడం వల్ల డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత దిగజారి ఇంట్రా-డేలో 71.02కు పడిపోయింది. అయితే, తరువాత రూపాయి కోలుకొని ఆరంభ నష్టాలను పూడ్చుకోవడంతో పాటు చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే ఎనిమిది పైసల ఎగువన 70.79 వద్ద ముగిసింది. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడి మధ్య ఇరు దేశాలకు పరస్పర ప్రయోజనకరమయిన ఒప్పందం గురించి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించిన తరువాత సెషన్ రెండో అర్ధ భాగంలో రూపాయి విలువ వేగంగా పుంజుకుంది’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ పీసీజీ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ గ్రూప్ అధిపతి వీకే శర్మ తెలిపారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 18 పైసలు పతనమయి, 70.87 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.