బిజినెస్

రెండోరోజూ మార్కెట్లకు లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 27: బ్యాంకింగ్, ఐటీ షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మంగళవారం బలపడ్డాయి. దేశ స్థూలార్థిక పరిస్థితులపై నెలకొన్న ఆందోళనలు తొలగిపోవడం మదుపరుల సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 159 పాయింట్లు పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 57 పాయింట్లు పెరిగింది. రూపాయి విలువ నిలకడగా ఉండటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిపోవడం, చిల్లర ద్రవ్యోల్బణం కూడా తగ్గడం, ద్రవ్యలభ్యతను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు మార్కెట్ సెంటిమెంట్‌ను ఉత్తేజపరిచాయి. సెనె్సక్స్, నిఫ్టీ రెండూ కూడా ఆరంభంలో దిగువ స్థాయిల వద్ద ఉన్నప్పటికీ, సెషన్ చివరలో బాగా కోలుకున్నాయి. ఈ వారంలో జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం జరుగనున్న తరుణంలో ప్రపంచ వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు, ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కారణంగా మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ పరిస్థితి దేశీయ మార్కెట్ల లాభాలను నియంత్రించింది. 3చమురు ఉత్పత్తి పెరుగుతుండటం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం తగ్గుతోంది. రూపాయి బలపడుతోంది. వినియోగ వస్తువుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నియంత్రణ పరిధిలో ఉంటుందని అంచనా2 అని ఆర్థిక రంగ విశే్లషకులు పేర్కొన్నారు.
బీఎస్‌ఈ సెనె్సక్స్ మంగళవారం 159.06 పాయింట్లు (0.45 శాతం) పుంజుకొని, 35,513.14 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 57 పాయింట్లు (0.54 శాతం) పెరిగి, 10,685.60 పాయింట్ల వద్ద స్థిరపడింది. మార్చి చివరి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 42,000 కోట్ల నిధులు అందజేస్తానని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో మదుపరులు ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచారు. ఇదిలా ఉండగా, చైనా ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలను మరింత పెంచనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అమెరికన్ డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం స్వల్పంగా పతనమయింది.
మంగళవారం నాటి లావాదేవీలలో సెనె్సక్స్ ప్యాక్‌లోని ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతి, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. వీటి షేర్ల విలువ 2.53 శాతం వరకు పెరిగింది. మరోవైపు, సన్ ఫార్మా, హీరో మోటోకార్ప్, యెస్ బ్యాంక్, విప్రో, బజాజ్ ఆటో, భారతి ఎయిర్‌టెల్, టాటా స్టీల్ షేర్ల ధర 3.34 శాతం వరకు పడిపోయింది. ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) సోమవారం నికరంగా రూ. 62.74 కోట్ల విలువయిన షేర్లను, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) నికరంగా రూ. 351.78 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు. బ్రాడర్ మార్కెట్లు కూడా మంగళవారం బలపడ్డాయి. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ సూచీ 0.43 శాతం, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.32 శాతం చొప్పున పుంజుకున్నాయి. మిగతా ఆసియా దేశాలలో కొరియా, జపాన్ మార్కెట్లు లాభాల్లో ముగియగా, చైనా మార్కెట్లు నష్టపోయాయి.