బిజినెస్

మూడో రోజూ తగ్గిన పసిడి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 30: జాతీయ మార్కెట్‌లో బంగారం ధర వరుసగా మూడో రోజు కూడా తగ్గింది. 10 గ్రాముల పసిడి ధర 65 రూపాయలు తగ్గి, 31,475 రూపాయలకు చేరింది. మొత్తం మీద గత మూడు రోజుల్లో బంగారం ధర 310 రూపాయలు తగ్గడం బులియన్ మార్కెట్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. విదేశీ పెట్టుబడిదారులేగాక, దేశీయ మదుపరులు సైతం ఆసక్తిని ప్రదర్శించకపోవడం బంగారం ధర పడిపోవడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. కాగా, వెండి కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నది. కిలో వెండి శుక్రవారం నాటి మార్కెట్‌లో 85 రూపాయలు తగ్గి, 37,075 రూపాయలకు పడిపోయింది. రూపాయి మారకపు విలువ బలపడడం బంగారం ధర తగ్గుదలకు ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ ట్రేడర్లు అంటున్నారు. నగలు, ఇతరత్రా వాడకాలకు బంగారం అవసరమవుతుందని, అయితే, రూపాయి బలహీనంగా ఉన్నప్పుడు చాలా మంది పెట్టుబడిదారులు షేర్ మార్కెట్‌ను కాకుండా బులియన్ మార్కెట్‌వైపు దృష్టి సారిస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. అంటే, రూపాయి బలహీన పడితే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. బలపడితే డిమాండ్ తగ్గుతుంది. ప్రస్తుతం రూపాయి విలువ బలపడుతున్న తరుణంలో బులియన్ మార్కెట్ బలహీనంగా కనిపిస్తున్నది. కానీ, వచ్చే వారం పరిస్థితులు మెరుగుపడతాయని, మార్కెట్‌లో ద్రవ్య లబ్ధత మార్కెట్‌కు ఊతమిస్తుందని నిపుణులు అంటున్నారు.