బిజినెస్

ఐటి అధికారుల తీర్మానంపై ఆర్థిక శాఖ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: రెవిన్యూ డిపార్ట్‌మెంట్ జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా ఆదాయం పన్ను శాఖకు చెందిన కొంతమంది అధికారులు ఒక తీర్మానాన్ని ఆమోదించడాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణిస్తూ,క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషించాలో దానికి సలహా ఇస్తూ గ్రూపు ఎ సర్వీసుకు చెందిన అధికారులు తీర్మానాన్ని ఆమోదించడాన్ని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా పరిగణించారు. ఇది నిజంగా క్రమశిక్షణను ఉల్లంఘించడమే. క్రమశిక్షణా రహిత చర్యలకు అధికారులు పాల్గొనడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం కిందికే వస్తుంది’ అని తీవ్ర పదజాలంతో కూడిన ఒక ప్రకటనలో ఐటి శాఖ పేర్కొంది. రెవిన్యూ డిపార్ట్‌మెంట్ ఆపరేషనల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఆదాయం పన్ను శాఖ అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయడమేనని పేర్కొంటూ, ఈ అంశంపై చర్చించడం కోసం ఆదాయం పన్ను శాఖకు చెందిన ఉన్నతాధికారులు గత వారం ముంబయిలో సమావేశమైనట్లు మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సిబిడిటి) స్వయంప్రతిపత్తిని రెవిన్యూ విభాగం బేఖాతరు చేస్తోందని వారు ఆమోదించిన ఒక తీర్మానంలో ఆరోపించారు. అయితే ప్రభుత్వానికి చెందిన ఎ డిపార్ట్‌మెంట్ కూడా పూర్తి స్వయంప్రతిపత్తి కలిగినది కాదని, ప్రభుత్వ విస్తృత లక్ష్యాన్ని అది నెరవేర్చాల్సి ఉంటుందని, ప్రభుత్వంలోని ఎవరు కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా చూడడం కోసమే పై అధికారికి సూపర్వైజరీ అధికారాలు ఉంటాయి అని ఆర్థిక శాఖ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది.