బిజినెస్

ఆశాజనకంగా ఉత్పత్తుల పీఎంఐ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 3: ఉత్పత్తులకు సంబంధించిన కొనుగోళ్ల నిర్వాహణ సూచీ (పీఎంఐ) ఆశాజనకంగా కనిపిస్తున్నది. గత నెల మెరుగైన ఫలితాలు వెల్లడి కావడంతో, ఈనెల కూడా అదే తరహా సూచీలు ఉంటాయని విశే్లషకులు భావిస్తున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సప్లై మేనేజ్‌మెంట్ (ఐఎస్‌ఎం) ప్రతినెలా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్‌ను విడుదల చేస్తుంది. నాలుగు వందలకుపైగా భారీ కంపెనీలకు సంబంధించిన ఈ పీఎంఐ నవంబర్‌లో 54.0 శాతంగా నమోదైంది. అక్టోబర్ మాసంలో అది 53.1 శాతం. గత ఏడాది డిసెంబర్‌లో అత్యధికంగా 54.7 శాతం నమోదైంది. మొత్తం మీద గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకూ పనె్నండు నెలల కాలంలో ప్రతిసారీ యాభైప్లస్‌గానే కొనసాగుతూ వచ్చింది. నవంబర్‌లోనే 54 శాతం నమోదు కాడవంతో, ఈనెల మరింత పెరుగుల సాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సహజంగా కొత్త ఆర్డర్లు, జాబితాల స్థాయి, ఉత్పత్తి, సరఫరా తీరుతెన్నులు, ఉద్యోగిత అనే ఐదు కీలక అంశాలపై వివిధ రంగాల్లో ఉత్పత్తుల పీఎంఐ ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలు ఆశాజనకంగా ఉంటే, పీఎంఐ కూడా అదే స్థాయిలో మెరుగైన ఫలితాలను సాధిస్తుంది. గత నెల సూచీని గమనిస్తే, ఈనెల కూడా ప్లస్ ఫిఫ్టీగా పీఎంఐ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.