బిజినెస్

ఆర్థిక స్థిరీకరణ చర్యలను కొనసాగించాలి : ఐఎంఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 28: బయటి పరిణామాల ప్రభావాలకు లోనుకావడాన్ని తగ్గించుకోవడానికి, అలాగే పెట్టుబడుల అవకాశాలను మెరుగుపర్చుకోవడానికి ప్రభుత్వం జిఎస్‌టి బిల్లును ఆమోదించడం, సబ్సిడీలకు సంబంధించి మరిన్ని సంస్కరణలు చేపట్టడం లాంటి వాటితో సహా ఆర్థిక స్థిరీకరణ చర్యలను కొనసాగించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఒక నివేదికలో అభిప్రాయ పడింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత దేశపు బయటి రంగం పరిస్థితి మధ్యకాలిక ఫండమెంటల్సకు, ఆవించిన పాలసీ లక్ష్యాలకు అనుగుణంగానే ఉన్నాయని ఐఎంఎఫ్ అభిప్రాయ పడింది. అయితే బయటి పరిస్థితుల ప్రభావాలకు లోనుకావడాన్ని తగ్గించుకోవడానికి, అలాగే 2017-18 ఆర్థిక సంవత్సరం నాటికి నిర్ణయించుకున్న లక్ష్యమైన ద్రవ్య లోటును జిడిపిలో 3 శాతానికి తగ్గించుకోవడానికి ప్రభుత్వం జిఎస్‌టి బిల్లును ఆమోదింపజేసుకోవడం, మరిన్ని సబ్సిడీ సంస్కరణలు చేపట్టడం లాంటి వాటితో సహా ఆర్థిక స్థిరీకరణ చర్యలను చేపట్టాలని ఐఎంఎఫ్ ఒక పరిశోధనా పత్రంలో పేర్కొంది. దేశీయ సరఫరాల రంగంలోప్రతిబంధకాలు తగ్గిపోవడం వల్ల ఎగుమతులు పెరిగి పెట్టుబడుల అవకాశాలు మెరుగుపడ్డం కూడా ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని ఆ పత్రంలో ఐఎంఎఫ్ అభిప్రాయ పడింది.