బిజినెస్

భారత్ వ్యాపార సంస్థలకు యూకే శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, డిసెంబర్ 5: వ్యాపారంలో వృత్తినిపుణులను తయారు చేసే సంస్థగా పేరొందిన బ్రిటీష్‌కు చెందిన ఒక వ్యాపార సంస్థ భారత్‌లోని సూక్ష్మ, చిన్నతరహా సంస్థల సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మేరకు ద ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ), మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజస్ (ఎంఎస్‌ఎంఇ)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోనుంది. కార్పొరేట్ పరిపాలనా విధానంలో సూక్ష్మ, చిన్నతరహా సంస్థల వారిని నిష్ణాతులను చేసేందుకు యూకేకు చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్టు ఐఓడీ వైస్‌ప్రెసిడెంట్ ప్రదీప్ చతుర్వేది బుధవారం వెల్లడించారు. 3రిస్క్ ఎథిక్స్4పై సింగపూర్‌లో జరిగిన గ్లోబల్ కనె్వన్న్‌లో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా కంపెనీలకు శిక్షణపై దృష్టి పెట్టామని ఈ శిక్షణతో ఇవి తమతమ వ్యాపారాన్ని విస్తృతం చేసుకుంటాయని అన్నారు. అలాగే ఐఓడీ ద్వారా ఎంఎస్‌ఎంఇ చేపడుతున్న పలు కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయనున్నట్టు చెప్పారు. ముఖ్యంగా దీనిద్వారా వచ్చే పబ్లికేషన్స్, ఈ-పబ్లికేషన్స్ గురించి వివరిస్తామన్నారు.