బిజినెస్

బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 28: దేశ వ్యాప్తంగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం నిర్వహించ తలపెట్టిన సమ్మె యథాతథంగా జరుగనుంది. సమ్మెకు పిలుపునిచ్చిన యూనియన్ల ఐక్య వేదిక (యుఎఫ్‌బిఎ)తో పాటు ఐబిఎ (ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్)కి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య మంగళవారం జరిగిన రాజీ సమావేశం విఫలమవడంతో ఈ సమ్మె యథాతథంగా జరుగుతుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) ముఖ్య నాయకుడు ఒకరు తెలిపారు. వివిధ అంశాలపై బ్యాంకు యూనియన్ల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించినప్పటికీ ఐబిఎ నుంచి గానీ ప్రభుత్వ ప్రతినిధుల నుంచి గానీ ఎటువంటి స్పందనా లేదని ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్.వెంకటాచలం చెన్నైలో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ప్రభుత్వ విధానాలపై సమీక్ష జరుపతామని, వాటిని సవరిస్తామని ఇటు ఐబిఎ నుంచి అటు ప్రభుత్వ ప్రతినిధుల నుంచి ఎటువంటి హామీ గానీ, సూచన గానీ రాలేదని, ప్రభుత్వ విధానాలను సమర్ధించుకునేందుకే వీరు ప్రయత్నించారని వెంకటాచలం పేర్కొన్నారు. కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ రాజీ సమావేశానికి యుఎఫ్‌బియులోని మొత్తం తొమ్మిది సంఘాల (ఎఐబిఇఎ, ఎఐబిఓసి, ఎన్‌సిబిఇ, ఎఐబిఓఎ, బిఇఎఫ్‌ఐ, ఐఎన్‌బిఇఎఫ్, ఐఎన్‌బిఓసి, ఎన్‌ఓబిడబ్ల్యు, ఎన్‌ఓబిఓ) ప్రతినిధులు హాజరయ్యారని ఆయన తెలిపారు. ఈ సమావేశం విఫలమైనందున బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వం చేపట్టదలుచుకున్న అవాంఛనీయ సంస్కరణలకు వ్యతిరేకంగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు, విదేశీ బ్యాంకులకు చెందిన 80 వేలకు పైగా శాఖల్లోని ఉద్యోగులు శుక్రవారం సమ్మె నిర్వహించి సర్కారు తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తారని వెంకటాచలం స్పష్టం చేశారు.