బిజినెస్

వడ్డీ రేటు యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బ్యాంకులకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. క్యాష్ రిజర్వ్ రేషియో (సీఆర్‌ఆర్)ను కూడా ఆర్‌బీఐ మార్చలేదు. ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమయ్యే కమిటీ రెపో రేట్లపై నిర్ణయాలను తీసుకుంటుంది. జూన్ మాసంలో సమావేశమైనప్పుడు వడ్డీ రేటును 0.25 శాతం పెంచడంతో అది 6.50 శాతానికి చేరింది. ఆగస్టులో మాసంలో సమావేశమైనప్పుడు కనీసం మరో 0.25 శాతం పెంచుతారన్న అభిప్రాయం వ్యక్తమైంది. ద్రవ్యోల్బణం, వృద్ధి రేటు కుంటుపడడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని, బ్యాంకులు డిమాండ్ చేస్తున్న విధంగా రెపో రేటును సవరిస్తారని అంతా ఊహించారు. కానీ, వడ్డీ రేటు 6.50 శాతంగానే ఉంచాలని అప్పట్లో ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా బుధవారంతో ముగిసిన మూడు రోజుల సమావేశంలోనూ ఆర్‌బీఐ ఎలాంటి మార్పులకు పూనుకోకపోవడం గమనార్హం. రెపో రేటును 6.50 శాతం, రివర్స్ రెపోను 6.25 శాతంగా ఉంచాలని ఆర్‌బీఐ తీర్మానించింది. వృద్ధిరేటుతోపాటు, బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల పనితీరుపై ఈ నిర్ణయ ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తిని రేపుతున్నది.
బ్యాంక్ స్టాక్స్ పతనం
రెపో రేట్లను సవరించకుండా, యథాతథంగా కొనసాగించాలన్న ఆర్‌బీఐ తీర్మానాన్ని ఆమోదించిందన్న వార్త బ్యాంక్ స్టాక్స్‌ను ప్రభావితం చేసింది. ఐడీబీఐ బ్యాంక్ వాటాల ధర 3.46 శాతం పతనమైంది. ఇండస్‌ఇండ్ రెండు శాతం, ఐసీఐసీ బ్యాంక్ 1.93 శాతం చొప్పున నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇతర బ్యాంకుల వాటాల విషయానికి వస్తే, కోటక్ మహీంద్ర బ్యాంక్ 1.39 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.30 శాతం చొప్పున పడిపోయాయి. చివరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కి కూడా నష్టం తప్పలేదు. ఆ బ్యాంక్ వాటాలు 0.74 శాతం నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో బ్యాంకెక్స్ లావాదేవీలు సగటున ఒక శాతం నష్టపోయి, 29,5999.00గా నిమోదయ్యాయి. స్థూల జాతీయోత్పత్తికి సహకరించడంతోపాటు, వృద్ధిరేటును కనీసం 7.4 శాతం ఉండేలా చూసేందుకే వడ్డీ రేటును సవరించలేదని ఆర్‌బీఐ ప్రకటించింది. ఇలావుంటే, రెపో రేటును ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించాలన్న ఆర్‌బీఐ నిర్ణయం ముందుగా ఊహించిందేనని ఫిక్కీ వ్యాఖ్యానించింది. అయితే, వృద్ధి రేటు కుంటుపడే ప్రమాదం కనిపిస్తున్నదని, కాబట్టి, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫిక్కీ అధ్యక్షుడు రషేష్ షా ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. అదే విధంగా రూపాయి మారకపు విలువను పెంచడానికి, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ద్రవ్య లబ్ధతను సులభతరం చేయడానికి కూడా సమగ్ర ప్రణాళికలను సిద్ధం చేసుకొని, వాటిని అమలు చేయాలని సూచించారు.
చిత్రం..ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్