బిజినెస్

మార్కెట్‌లోకి టీవీఎస్ రేడియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ప్రఖ్యాత ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్స్ తన సరికొత్త మోడల్ ‘టీవీఎస్ రేడియన్’ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 110 సీసీ కమ్యూటర్ మోటార్ సైకిల్ టీవీఎస్ రేడియంట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్టు కంపెనీ మార్కెటింగ్ వైస్‌ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్ విశాఖలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఇప్పటి వరకూ మోటార్ సైకిళ్ల మోడల్స్ అన్నింటికీ భిన్నంగా సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ (ఎస్‌బీటీ)తో రేడియన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్టు తెలిపారు. వేగంగా నడుస్తున్న వాహనం అదుపుతప్పకుండా నియంత్రించేందుకు ఎస్‌బీటీ దోహదపడుతుందన్నారు. గరిష్ట స్థాయిలో శక్తి, ఇంథన సామర్థ్యాన్ని అందించేలా రేడియన్‌కు రూపకల్పన చేశామన్నారు. టీవీఎస్ రేడియన్ 7000 ఆర్‌పీఎం వద్ద 8.7ఎన్‌ఎం, 5000 ఆర్‌పీఎం వద్ద 8.4పీఎస్ శక్తిని అందించేలా డిజైన్ చేశారన్నారు. లీటరు పెట్రోలుకు 69.7 కిమీ ఇంథన సామర్థ్యాన్ని అందించగలదన్నారు. ఐదు సంవత్సరాల వారంటీతో టీవీఎస్ రేడియన్ తెలుపు, నలుపు, బీజ్, పర్పుల్ రంగుల్లో అందుబాటులోకి వస్తోందన్నారు. టీవీఎస్ రేడియన్ ధర రూ.48,990 (ఎక్స్‌షోరూం, ఆంధ్రప్రదేశ్)గా నిర్ణయించామన్నారు. ఈ ఏడాదిలో దేశ వ్యాప్తంగా రెండు లక్షల టీవీఎస్ రేడియన్ విక్రయాలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.

చిత్రం..రేడియన్ మోటార్ సైకిల్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్న మార్కెటింగ్ వైస్‌ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్