బిజినెస్

తగ్గిన మ్యూచువల్ ఫండ్స్ ఏయూఎం ఆస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: మ్యూచువల్ ఫండ్స్ ఆధ్వర్యంలోని నిర్వాహణ ఆస్తులు (ఏయూఎం) గత నెల గణనీయంగా తగ్గాయి. వివిధ క్లయింట్స్ తరఫున, ఆయా కంపెనీల నిర్వాహణ బాధ్యతను మ్యూచువల్ ఫండ్స్ చేపడుతుంది. అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్ లేదా ఏయూఎంగా పిలిచే ఈ ఆస్తుల విలువ ఈ ఏడాది జనవరిలో 22,41,275 కోట్ల రూపాయలు ఉంది. ఫిబ్రవరిలో 22,20,326 కోట్ల రూపాయలకు చేరుకున్న ఈ ఆస్తుల విలువ మార్చిలో భారీగా తగ్గి, 21,36,036 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఏప్రిల్-జూలై మధ్య కాలంలో ఒడిదుడుకులకు గురవుతూ ముందుకు కదిలింది. అయితే, ఆగస్టులో అత్యధికంగా 25,20,430 కోట్ల రూపాయలు కావడంతో, ఈ ఆస్తులు మరింతగా పెరుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఆ వెంటనే, సెప్టెంబర్‌లో ఇది 22,04,423 కోట్లకు పడిపోయింది. అక్టోబర్‌లో మరింత దిగజారి రూ.22,23,560 కోట్లకు చేరింది. నవంబర్ నెల ఆస్తులను లెక్కించాల్సి ఉంది. పరిస్థితులు మెరుగుపడకపోతే, మ్యూచువల్ ఫండ్స్‌కు కూడా ఇబ్బందులు తప్పవేమోనని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.