బిజినెస్

బంగారం ధర స్వల్పంగా పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 7: నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ శుక్రవారం బయటపడి లాభాల బాటపడితే, అందుకు భిన్నంగా బులియన్ మార్కెట్ లాభాలకు బ్రేక్ పడింది. పది గ్రాముల బంగారం ధర 20రూపాయలు తగ్గి, 32,100 రూపాయలుగా నమోదైంది. ఈవారం ప్రారంభంలో 31,850 రూపాయలుగా ఉన్న బంగారం ధర బుధవారం నాటికి 31,950 రూపాయలకు చేరింది. గురువారం మరికొంత పెరిగి, 32,120 రూపాయల వద్ద ముగిసింది. అయితే, దేశీయ నగల వ్యాపారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో, బులియన్ మార్కెట్ నీరసపడింది. చివరికి 20 రూపాయలు తగ్గింది. ఈ నష్టం తాత్కాలికమేనని, మళ్లీ పుంజుకోవడం ఖాయమని బులియన్ మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.