బిజినెస్

ఎయిర్ ఇండియా భవనంపై ఎల్‌ఐసీ, జీఐసీ కన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 7: నారీమన్ పాయింట్‌లోని 23 అంతస్థుల ఎయిర్ ఇండియా భవనంపై జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ), జనల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ) కనే్నశాయి. ఈ భవనాన్ని అమ్మాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం వద్ద చాలాకాలంగా ఉంది. కానీ, ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, భవనాన్ని అమ్మకానికి పెడితే, దానిని సొంతం చేసుకోవడానికి ఎల్‌ఐసీ, జీఐసీ ఉబలాటపడుతున్నాయి. ఒకవేళ ఆ భవనాన్ని దక్కించుకుంటే, అందులోనే కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నది అటు ఎల్‌ఐసీ, ఇటు జీఐసీ ఆలోచనగా కనిపిస్తున్నది. ఎయిర్ ఇండియా భవనాన్ని అమ్మే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. ఇందుకు కేంద్ర అనుమతి కూడా అవసరమని అన్నారు. అమ్మకానికి ఉంచితే, దానిని కొనడానికి రెండు సంస్థలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని అతను పరోక్షంగా ఎల్‌ఐసీ, జీఎస్‌సీ గురించి ప్రస్తావించారు. ఇలావుంటే, జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (జేఎన్‌పీటీ) కూడా ఈ భవనంపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తున్నది. ముంబయిలో అత్యంత కీలక ప్రాంతంలోని ఈ భవనం అమ్మకానికి వస్తే, ఇంకెన్ని సంస్థలు బిడ్డింగ్‌కు పోటీపడతాయో చూడాలి. ఎల్‌ఐసీ, జీఐసీ ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లోనూ భారీ లాభాలను ఆర్జించి, అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. అందుకే, మరింతగా విస్తరించేందుకు వీలుగా ఉంటుందని ఎయిర్ ఇండియా భవనంపై ఈ రెండు సంస్థలు దృష్టి పెట్టాయి. కాగా, ఎయిర్ ఇండియా 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 47,145.62 కోట్ల రూపాయల మేర నష్టాలను ఎదుర్కొంది. కొంతలో కొంతైనా లోటును భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ముంబయి, చెన్నై నగరాల్లోని భవనాలు, ఇతర ఆస్తులను అమ్మడం ద్వారా 543.03 కోట్ల రూపాయల వరకూ సమకూర్చుకుంది. ఆ క్రమంలోనే భాగంగా ముంబయి నారీమన్ పాయింట్ వద్దగల ప్రతిష్టాత్మక భవనాన్ని కూడా అమ్మేందుకు సిద్ధమైందని సమాచారం. కానీ, అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.