బిజినెస్

థాయ్‌లాండ్‌కు ఏపీ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 7: రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ రాష్ట్ర పర్యాటక ప్రత్యేకతలు వివరిస్తూ బృందాలు పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్రంలో బౌద్ధారామాలు, బౌద్ధం వర్ధిల్లిన ప్రాంతాలను సందర్శించాలంటూ బౌద్ధులు ఎక్కువగా ఉండే దేశాలను సందర్శిస్తున్నాయి. దీనిలో భాగంగానే వచ్చే నెలలో 12 మంది సభ్యుల బృందం థాయ్‌లాండ్‌లో పర్యటించనుంది. టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఆరుగురు, ఆతిథ్య రంగం నుంచి మరో ఆరుగురు రాష్ట్ర ప్రభుత్వం తరపున థాయ్‌లాండ్ సందర్శించనున్నారు. రాష్ట్రంలో బుద్ధిస్ట్ సర్కూట్ సందర్శనకు అక్కడవారిని ఆకర్షించనున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో బౌద్ధారామాలను, బౌద్ధం ఫరిడవిల్లిన ప్రాంతాలను కలుపుతూ ఐదు రోజుల టూర్‌ను ప్రచారం చేయాలని నిర్ణయించారు. థాయ్‌లాండ్ సహా ఇతర దేశాల నుంచి వచ్చే వారికి విశాఖ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. తొలి రోజు సాలిహుండం, రామతీర్థం ప్రాంతాలను, రెండో రోజు విశాఖ జిల్లాలోని బావికొండ, తొట్లకొండ, పావురాలమెట్ట, బొజ్జన్నకొండల్లో బౌద్ధ స్థూపాలను చూపిస్తారు. మూడో రోజున అడ్డూరు, భీమవరం, ప్రాంతాలు, నాలుగోరోజున ఘంటసాల, గుంటపల్లి బౌద్ధారామాలను, చివరగా అమరావతి, నాగార్జున సాగర్, విజయవాడతో ఐదు రోజుల టూర్‌ముగిస్తారు. సర్కూట్ టూర్ విజయవంతమైతే ఇతర దేశాల నుంచి బుద్ధిస్ట్‌లు ఎక్కువగా సందర్శించే అవకాశం ఉందని ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే విజయ్ మోహన్ ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా పర్యాటకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల దేశీయ, విదేశీ పర్యాటకుల రాక పెరిగిందన్నారు. గతంతో పోలిస్తే 4 శాతం మేర వీరి సంఖ్యపెరిగిందన్నారు. ఇప్పటి వరకూ థాయ్‌లాండ్, హాంకాంగ్ తదితర దేశాల నుంచి వచ్చే బౌద్ధ పర్యాటకులు యూపీలోని గయ ప్రాంతానికి వెళ్లేవారన్నారు. గతేడాది గయ క్షేత్రాన్ని సందర్శించిన పర్యాటకుల సంఖ్య నాలుగు లక్షలకు పైనే ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ముఖ్యంగా ఈ వీసా ఆన్ అరైవల్‌తో ఇన్న ఇబ్బందులు తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న చొరవ ఇందుకు దోహదం చేసిందన్నారు. గతంలో ఈ వీసాతో హైదరాబాద్ వరకూ మాత్రమే విదేశీ పర్యాటకులు రాగలిగేవారని, నవ్యాంధ్రలో వారికి ప్రవేశం ఉండేది కాదన్నారు.
విశాఖను టూరిస్ట్ గేట్‌వే డెస్టినేషన్‌గా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపడుతోందన్నారు. విశాఖ చేరుకునే పర్యాటకులు ఇక్కడ నుంచి ఒడిశా, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లోని దర్శనీయ స్థలాలు సందర్శించేలా ప్యాకేజీ టూర్లు ఏర్పాటు చేస్తామన్నారు.