బిజినెస్

వారాంతంలో కోలుకున్న సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఈవారం మొదటి నుంచి నష్టాల్లో నడిచిన సెనె్సక్స్ శుక్రవారం కోలుకుంది. 361.12 పాయింట్లు (1.02 శాతం) మెరుగుపడడంతో 35,673.25 పాయింట్లకు చేరుకుంది. ఈవారం స్టాక్స్ లావాదేవీలకు చివరి రోజైన శుక్రవారం నిఫ్టీ కూడా 92.55 పాయింట్లు (0.87 శాతం) లాభపడి 10,693.70 పాయింట్లుగా ముగిసింది. అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలించడంతోపాటు, రూపాయి మారకపు విలువ బలపడుతున్నదన్న సమాచారం కూడా స్టాక్ మార్కెట్‌కు ఊతమిచ్చింది. వరుసగా మూడు రోజుల నష్టాల నుంచి తేరుకొని, మళ్లీ లాభాల బాట పట్టింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ అన్నింటికంటే మెరుగైన ఫలితాలను రాబట్టింది. దీని వాటాలు తొమ్మిది శాతం పెరగడం విశేషం. ఈ మార్పును గమనించిన తర్వాత ప్రైవేటు రంగంలోని వాటాలను కొనుగోలు చేయాలని వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే నిర్ణయించినట్టు సమాచారం. ప్రిఫరెన్షినల్ అలాట్‌మెంట్స్ ద్వారా ప్రమోటర్స్ వాతాలను సొంతం చేసుకోవడానికి హాత్‌వే నాలుగు నుంచి ఆరు బిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నట్టు మార్కెట్ వార్గలు అంటున్నాయి. అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, హెచ్‌యూఎల్, ఎల్ అండ్ టీ, మహీంద్ర అండ్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర కంపెనీల షేర్లు కూడా సగటున మూడు శాతం లాభపడ్డాయి.
కాగా, సన్ ఫార్మా, కోల్ ఇండియా, ఎస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ సంస్థలు నష్టాలను ఎదుర్కొన్నాయి. ఈ కంపెనీల షేర్ల ధర సగటున రెండు శాతం పతనమైంది. అంతకు ముందు వరుసగా మూడు రోజుల పాటు బలహీనంగా ట్రెడింగ్ కొనసాగడాన్ని దేశీయ మదుపరులు జాగ్రత్తగా గమనించి, విశే్లషించి నిర్ణయాలు తీసుకున్నారని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు. అమెరికా, చైనా దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి త్వరలోనే తెరపడుతుందన్న అభిప్రాయం కూడా చివరి రోజున మార్కెట్‌కు ఊతమిచ్చింది.