బిజినెస్

పెరిగిన బంగారం ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 8: బులియన్ మార్కెట్‌లో గత వారం చివరి రోజైన శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరిగి, రూ. 32,350 చేరుకోవడం కొత్త వారంలోనూ అదే ట్రెండ్ కొనసాగే అవకాశాలున్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోలియం ధర పెరుగుదలతోపాటు డాలర్‌కు రూపాయి మారకం విలువ తగ్గడంతో స్టాక్ మార్కెట్ నీరసించింది. అదే సమయంలో బులియన్ మార్కెట్ మరింత బలపడింది. ప్రపంచ మార్కెట్‌లోనూ పసిడి ధగధగ మెరిసిపోతున్నది. ద్రవ్య విధానాలు, ఆర్థిక స్థితిగతులు నిలకడగా లేకపోవడంతో, మదుపరుల దృష్టి స్టాక్ మార్కెట్ నుంచి బులియన్ మార్కెట్‌వైపు మళ్లుతున్నది. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం 1,247.46 డాలర్లుగాను, వెండి 14.62 డాలర్లుగానూ ఉంది. ఈ ఏడాది ఆగస్టు మాసంలో అంతకు ముందు 19 నెలల కాలంలో ఎన్నడూ లేనంతగా 7 శాతం నష్టాలు చవిచూసిన బంగారం ఆతర్వాత కోలుకోవడం మొదలైంది. వరుసగా సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలల్లో లాభాలను ఆర్జిస్తూ దూకుడును కొనసాగిస్తున్నది. ఒకటిరెండు సందర్భాలను మినహాయిస్తే, బంగారం ధర పైపైకి పెరుగుతునే ఉంది. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్న విషయం తెలిసిందే. వచ్చే వారం బులియన్ మార్కెట్ ఏ విధంగా ఉంటుందనేది ఈ ఫలితాలే నిర్ధారిస్తాయి. ఈనెల చివరిలో క్రిస్మస్, ఆతర్వాత కొత్త సంవత్సరాది, వచ్చేనెల సంక్రాంతి పండుగ ఉండడంతో బులియన్ మార్కెట్ మరికొంత కాలం ఎలాంటి పతనం లేకుండా కొనసాగుతుందనే వాదన వినిపిస్తున్నది. ఏదైనా అనుకో ని ఉపద్రవంగానీ, అంతర్జాతీయ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తే తప్ప, బులియన్ మార్కెట్‌కు వచ్చే వారం ఎలాంటి సమస్య ఉండదని, బంగారం ధర పెరుగుతునే ఉంటుందని విశే్లషకులు అభిప్రాయ పడుతున్నారు. పరిస్థితులు కూడా ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మొత్తానికి మరో వారం కూడా పసిడి మెరుపులు ఖాయంగా కనిపిస్తున్నాయి.