బిజినెస్

తలసరి ఆదాయంలో విశాఖ, కృష్ణా టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 28: ఆంధ్రప్రదేశ్‌లో గత కొనే్నళ్ల నుంచి విశాఖపట్నం, కృష్ణా జిల్లాలు తలసరి ఆదాయంలో వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో కొనసాగుతున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు జిల్లాల వారీగా తలసరి ఆదాయ వివరాలు విడుదల చేశారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అభివృద్ధిని వికేంద్రీకరించి వెనకబడిన జిల్లాల్లో కూడా తలసరి ఆదాయంపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా అన్ని జిల్లాల సమాన అభివృద్ధి ప్రాతిపదికగా ప్రతి జిల్లాలోనూ అక్కడ లభ్యతలో ఉన్న పంటలు, ఖనిజాలు, భూమి ఇతర ఉత్పత్తుల ఆధారంగా భారీ పారిశ్రామిక ప్రాజెక్టుల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో అన్ని రంగాల్లో ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుండటంతో తలసరి ఆదాయం పెరుగుతూ వస్తోంది. ఆదాయం పెరగడంతో ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరిగింది. అయితే వెనకబడిన జిల్లాలు వెనకబడే ఉన్నాయి. తలసరి ఆదాయంలో అయిదేళ్ళుగా అగ్రస్థానంలో ఉన్న జిల్లాలు అలాగే ఉన్నాయి. ప్రథమ స్థానంలో ఉన్న జిల్లాలు ఎదుగుబొదుగు లేకుండా అలానే ఉన్నాయి. 2011-12 నుంచి 2015-16 వరకు వరసగా ఐదు సంవత్సరాలు విశాఖ జిల్లా మొదటి స్థానంలో, కృష్ణా జిల్లా రెండవ స్థానంలో కొనసాగుతూ వస్తున్నాయి. విశాఖ జిల్లాలో తలసరి ఆదాయం 2011-12లో రూ. 1,05,362 ఉండగా, ఏడాదికి ఏడాది పెరుగుతూ 2015-16లో రూ. 1,40,628 వరకు పెరిగింది. కృష్ణా జిల్లాలో 2011-12లో రూ. 81,851 ఉండగా, 2015-16లో రూ. 1,40,593కు పెరిగింది. లక్ష రూపాయలకు మించి తలసరి ఆదాయం ఉన్న జిల్లాలు 2014-15లో నాలుగు ఉండగా, గత ఏడాది 8 ఉన్నాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో రూ. 1,21,784, నెల్లూరు జిల్లాలో రూ. 1,15,928, గుంటూరు జిల్లాలో రూ. 1,09,556, ప్రకాశం జిల్లాలో రూ. 1,07,706, చిత్తూరు జిల్లాలో రూ. 1,00,443, కడప జిల్లాలో రూ, 91,888 తలసరి ఆదాయం ఉంది. అనంతపురం జిల్లాలో రూ. 89,084, కర్నూలు జిల్లాలో రూ. 88,308, విజయనగరం జిల్లాలో రూ. 86,223, శ్రీకాకుళం జిల్లాలో రూ. 74,638 ఉంది. శ్రీకాకుళం జిల్లా అయిదు సంవత్సరాలు వరుసగా చివరి స్థానంలోనే ఉంది. 2011-12లో ఆ జిల్లాలో తలసరి ఆదాయం రూ. 51,645 ఉండగా, 2014-15లో రూ. 64,971 ఉంది.