బిజినెస్

‘ఇన్‌సైడర్’లో మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో భారీ కుంభకోణానికి పాల్పడిన భారతీయుడిపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం సింగపూర్‌లోని ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంక్ ఉద్యోగి గన్నమనేని రాజేశ్వర్ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో భారీగా అవతవకలకు పాల్పడ్డాడని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి సుమారు ఆరు లక్షల డాలర్ల వరకూ అక్రమంగా సంపాదించాడని అభియోగాలు ఉన్నాయి. భారత్‌లో ఉంటున్న అతని తండ్రి లింగారావు, భార్య దీప్తిపై కూడా అమెరికా ఐటీ అధికారులు న్యూయార్క్‌లో కేసు నమోదు చేశారు. సుమారు 40 కంపెనీలకు సంబంధించిన విలీనాలు, కొనుగోళ్లు, అమ్మకాలు తదితర లావాదేవీల్లో రాజేశ్వర్ అక్రమాలకు పాల్పడ్డాడని ఆధారాలతోసహా కోర్టుకు విన్నవించారు. దీనిపై రాజేశ్వర్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.