రాష్ట్రీయం

పరిశ్రమలతో అనుసంధానం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 10: విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమలకు అవసరమైన పరిశోధనలు జరగాలని టాటా ట్రస్టు చైర్మన్ రతన్ టాటా అభిప్రాయపడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమావేశంలో భాగంగా విశాఖలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలకు పరిశ్రమలతో అనుసంధానత పెరగడం ద్వారా వారికి అవసరమైన విధంగా వనరులను అభివృద్ధి చేసుకునేందుకు దోహదపడుతుందన్నారు. విద్యా వ్యవస్థను వాణిజ్య విఫణితో అనుసంధానించడం, చేరువ చేయడం జరగాలన్నారు. విఖ్యాత ఆంధ్ర విశ్వవిద్యాలయానికి టాటా గ్రూపు ఏ విధంగా సాయపడగలదో సమగ్ర సమీక్ష అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు. కలిసి పరిశోధనల్లో పాలుపంచుకునేందుకు టాటా గ్రూపు సిద్ధమేనని, ఏఏ రంగాల్లో ముందుకు సాగవచ్చో సంస్థ సభ్యులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. అనలటిక్స్ తదితర అంశాల్లో వివిధ రంగాలకు చెందిన సంస్థలతో కలిసి పనిచేయాలన్నారు. ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనడం అపూర్వ గుర్తుగా పదిలపరచుకుంటానని చెప్పారు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏయూను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం అందించే సాయానికి అంతే మొత్తం మ్యాచింగ్ గ్రాంటుగా ప్రభుత్వం తరపున ఇచ్చేందుకు సీఎం అంగీకరించారన్నారు. ఈ నాటి ముఖ్యఅతిధి రతన్ టాటా పేరిట ప్రతి ఏటా ప్రతిభను కనబరిచే విద్యార్థికి బంగారు పతక బహుకరణ, ఎండోమెంట్ లెక్చర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ రాజకీయ రాజధాని కాకపోయినా విద్య, పర్యాటక, పారిశ్రామిక, సాంస్కృతిక రాజధానిగా వెలుగొందుతోందన్నారు. ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షుడు జీఎం రావు మాట్లాడుతూ పారిశ్రామిక అవసరాల కు అనుగుణమైన కోర్సులు పెరగాల్సి ఉందన్నారు. భవిష్యత్ మొత్తం సాంకేతికతకు ఆగ్రాసనం వేస్తుందన్నారు.

చిత్రం..ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశంలో మాట్లాడుతున్న టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా