బిజినెస్

ఉద్యాన పంటల ఎగుమతుల్లో వృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉద్యాన పంటల ఎగుమతుల్లో దేశం 80 శాతం వృద్ధి సాధించి, కూరగాయలు, పండ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచి, పంటల ఎగుమతుల్లో సుమారు 20శాతం వాటాను సమకూర్చిందని ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ (అమరావతి సర్కి ల్) మణి పల్వేశస్ తెలిపారు. స్టేట్ బ్యాంక్ గ్రామీ ణ బ్యాంకింగ్ సంస్థ (ఎస్‌బీఐ-ఆర్‌బీ) లింగంపల్లిలో సోమవారం ఉద్యాన పంటలపై ఏర్పాటు చే సిన జాతీయ సదస్సును ఆమె ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి 2022 నాటికి వ్యవసాయదారుల ఆదాయం పెంచాలన్న సంకల్పంతో కేంద్రం అనేక చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అనువైన విధానాలను రూపొందించి వ్యవసాయ రంగంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టి అవసరమైన వౌలిక సదుపాయాలను కల్పించి రైతులకు తోడ్పాడు అందిస్తున్నాయన్నారు. ఆహార, విత్తనాల తయారీ పరిశ్రమలు కూడా దీనిపై దృష్టి సారించి, ఇప్పటికే దేశంలో సుమారు 42కు పైగా మెగా ఫుడ్ పార్కులు నెలకొల్పారని తెలిపారు. ఎస్‌బీఐ-ఆర్‌బీ జనరల్ మేనేజర్, డైరెక్టర్ జయశ్రీ రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ ఎస్‌బీఐ ఉద్యాన పంట రుణాల మంజూరీలో ఎప్పుడూ ముందున్నదన్నారు. ఎస్‌బీఐ-ఆర్‌బీ డిప్యూటీ జనరల్ మేనేజర్లు మధుకర్ రంజన్, లలితా రుద్రాభట్ల, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ ఎంఆర్ దీనిష్, నేషనల్ హార్టికల్చర్ బోర్డు ఇడి ఆనంద్ జామ్బ్రే, నాబార్డు జీఎం సీఎస్‌ఏఆర్ మూర్తి, జైస్ ఇరిగేషస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులు, వ్యవసాయ రంగ పారిశ్రామికవేత్తలు సదస్సులో పాల్గొన్నారు.