బిజినెస్

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 28: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. వరుస లాభాల్లో పరుగులు తీస్తున్న సూచీలకు మదుపరుల భయాలు బ్రేకులు వేశాయి. మార్చి నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగుస్తుండటం, ఏప్రిల్ 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష చేస్తుండటంతో ముందస్తుగా లాభాల స్వీకరణకు మదుపరులు ఆసక్తి కనబరిచారు. కీలక వడ్డీరేట్లు ఈసారి సమీక్షలో తగ్గుతాయన్న అంచనాలు సర్వత్రా వ్యక్తమవుతున్నప్పటికీ బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడం గమనార్హం. దీంతో గత నాలుగు రోజులుగా లాభాలను అందుకున్న సూచీలకు సోమవారం నష్టాలు తప్పలేదు.
బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 371.16 పాయింట్లు పతనమై 25 వేల స్థాయిని కోల్పోయి 24,966.40 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 101.40 పాయింట్లు దిగజారి 7,700 మార్కును చేజార్చుకుని 7,615.10 వద్ద నిలిచింది. ఇక బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 1.36 శాతం, స్మాల్-క్యాప్ 1.65 శాతం చొప్పున నష్టపోగా, రియల్టీ, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెలికామ్, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీ, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ రంగాల షేర్ల విలువ 4.35 శాతం నుంచి 1.92 శాతం క్షీణించింది. ఆసియా మార్కెట్లలో చైనా, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.06 శాతం నుంచి 0.73 శాతం వరకు పడిపోగా, జపాన్ సూచీ మాత్రం 0.77 శాతం పెరిగింది. హాంకాంగ్ మార్కెట్లకు సోమవారం సెలవు.
రూ. 1.24 లక్షల కోట్లు ఆవిరి
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసిన నేపథ్యంలో సోమవారం ఒక్కరోజే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ విలువ 1.24 లక్షల కోట్ల రూపాయలకుపైగా ఆవిరైపోయింది. బిఎస్‌ఇలోని సంస్థల విలువ 1,24,967 కోట్ల రూపాయలు హరించుకుపోయి 93,04,375 కోట్ల రూపాయలకు పడిపోయింది. గత వారం మూడు రోజుల్లో సెనె్సక్స్ 384.82 పాయింట్లు పుంజుకుని 25,337.56 వద్ద ముగియగా, నిఫ్టీ 112.15 పాయింట్లు అందిపుచ్చుకుని 7,716.50 వద్ద నిలిచింది. దీంతో వరుసగా నాలుగు వారాల్లో సెనె్సక్స్ 2,183.26 పాయింట్లు ఎగబాకినట్లవగా, నిఫ్టీ ఈ నాలుగు వారాల్లోనే 686.75 పాయింట్లు ఎగిసినట్లైంది.
ప్రభుత్వ బాండ్లకు విశేష స్పందన
న్యూఢిల్లీ: ప్రభుత్వ బాండ్లకు సంబంధించి విదేశీ మదుపరులకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో నిర్వహించిన వేలానికి విశేష స్పందన లభించింది. 5,035 కోట్ల రూపాయల విలువైన బాండ్లను వేలం వేస్తే, 6,810 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. సోమవారం సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఈ వేలం జరిగింది.